జగన్ మొహం చూసి ప్రజలు వైసీపీని భారీ మెజర్టీతో గెలిపిస్తే ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారు కూడా. ఇందుకు నిదర్శనాలుగా ఋషికొండ ప్యాలస్, కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాలున్నాయి.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ముఖ్యమంత్రి ఈవిదంగా అవినీతికి పాల్పడుతుంటే మంత్రులు మడి కట్టుకొని కూర్చుకుంటారా?కూర్చోరు.
కనుక మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో బియ్యం వగైరా నిలువ చేసేందుకు భారీ గోదాములు నిర్మించి రేషన్ బియ్యం నిలువ ఉంచేందుకు పౌరసరఫరా శాఖకు అద్దెకు ఇచ్చారు.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
ఈరోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన కాంట్రాక్ట్ కంపెనీలకే వందలు, వేలు కోట్లు విలువగల పనులు కట్టబెట్టడం ఎవరూ తప్పుగా భావించడం లేదు కనుక దీనినీ తప్పుగా భావించలేము.
తమ గోదాములలో తమ ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యం నిలువ చేసేందుకు బస్తాకు రూ.5 చొప్పున పేర్ని నానికి ఏటా కోట్లల్లో అద్దె ముట్టేది. కనుక ఆ బియ్యం భద్రతకు ఆయనే బాధ్యులు.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
కానీ గోదాములలో రూ. 90 లక్షల విలువైన 185 టన్నుల బియ్యం మాయం అయ్యింది! ఏదో 5-10 బస్తాలు తేడా వచ్చాయంటే అర్దం చేసుకోవచ్చు. కానీ ఏకంగా 3,700 బస్తాలు మాయం అయ్యాయి!
దీనిపై పౌరసరఫరాల శాఖ ఎండీ మంజీర్ జిలానీ గోదాముల యజమాని (పేర్ని నాని)పై క్రిమినల్ కేసు నమోదు చేసి రూ.1.80 కోట్లు జరిమానా విధించారు.
అయితే పేర్ని నానిపై కేసు నమోదు చేయగానే ఆయన ఏమంటారో ఊహించవచ్చు. అలాగే పేర్ని నాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 కోట్లు జరిమానా వసూలు చేయగలదా? అంటే అనుమానమే.
ఈ వ్యవహారం పక్కన పెడితే, పేర్ని నానికి చెందిన గోదాములలో నుంచి అంత రేషన్ బియ్యం ఎలా మాయం అయ్యింది?ఎక్కడికి పోయింది? అంటే కాకినాడ పోర్టు కళ్ళ ముందు మెదులుతుంది.
ఇవన్నీ కలిపి చూసిననట్లయితే జగన్ హయంలో రేషన్ బియ్యం ఓ పద్దతి ప్రకారం గోదాములలో నుంచి మాయం అయిపోయి, కాకినాడ లేదా మరో పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్నట్లు అర్దమవుతుంది.
ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుకనే పేర్ని నాని తన గోదాములలో బియ్యం మాయం అయిన సంగతి బయటపెట్టారు. ఒకవేళ మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఈ దొంగతనం బయటపెట్టేవారా?అంటే కాదనే అర్దమవుతోంది. నేటికీ యధేచ్చగా పౌర సరఫరాల శాఖ నుంచి వైసీపీ నేతల గోదాములకి.. అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం వెళ్ళిపోతూనే ఉండేది కదా?