
ప్రస్తుత క్రికెట్ అభిమానులు మే 17 ఎప్పుడు వస్తుందా అని కాసుకొని కూర్చున్నారు. మార్చ్ లో మొదలయిన ఐపీఎల్ ఎండింగ్ కు వస్తుందనగా, ఇండో-పాక్ వార్ దృష్ట్యా ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అయితే, ఎవరు ఊహించని విధంగా ఈసారి ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆడిన ప్రతి మ్యాచ్ లో గట్టి ప్రదర్శన కనపరిచింది ఆ జట్టు. ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడిన ఆర్.సి.బీ జట్టు ఏకంగా 8 మ్యాచ్లలో విజయాన్ని వశపరుచుకొని, ప్లే-ఆఫ్స్ కు అతి దగ్గరలో ఉంది.
Also Read – జగన్ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!
ఐపీఎల్ సీజన్ మొదలయింది అంటే, ఏకంగా ఒక అభిమాన వర్గమంతా ఆర్.సి.బీ జట్టును ట్రోల్ చేయటమే లక్ష్యంగా పెట్టుకుని ట్రోల్ చేస్తుంటారు. ఈ సీజన్ కూడా అదే పరిస్థితిలో ఆ జట్టు పై ఈ సాల కప్ నాందే నా అంటూ ట్రోలింగ్ గట్టిగా జరిగింది.
కానీ, ఆర్సీబీ తమ అత్యద్భుత ఆటతీరుతో సమిష్టిగా రాణించి జట్టు లోని ప్రతి బ్యాటర్, బౌలర్ సహకారంతో వరుసగా మ్యాచ్లను గెలుచుకున్నారు. అయితే, ఈ ఏడు ఆర్.సి.బీ ప్రదర్శన ఒక పక్కా కమర్షియల్ సినిమా లెక్క, ఇంట్రడక్షన్ నుండి యాక్షన్ తోనే ఫాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసారు.
Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్ పట్టించుకోవట్లేదే!
అయితే ఇంటర్వెల్ సమయానికి ఇండో-పాక్ వార్, అబ్బురపరిచే ట్విస్ట్ గా మారి, అభిమానులను కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ, హీరో కోసం పరిస్థితులన్నీ సద్దుమణిగినట్టు, యుద్ధ వాతావరణమంతా పోయి, మరల ఐపీఎల్ మొదలవబోతుంది. మరి ఇంటర్వెల్ లో వచ్చిన ఊహించని ట్విస్ట్ కు, సీజన్ క్లైమాక్స్ లో ఆర్.సి.బీ హ్యాపీ ఎండింగ్ ఇవ్వనుందా..?