
సరిగ్గా పదిహేడేళ్ల క్రితం ఐపీఎల్ మొదటి సీజన్ బెంగళూర్ vs కోల్కత్త గా మొదలైన ఈ క్రికెట్ సమరం ఇప్పుడు 2025 లో కూడా అదే జోరుతో ముందుకు సాగుతుంది. మార్చి 22 శనివారం మొదలుకానున్న ఈ ఏడాది ఐపీఎల్ సమరంలో తొలి మ్యాచ్ ఆడనుంది RCB , KKR .
అయితే 2008 లో బెంగళూరు వేదికగా మొదలైన తొలి ఐపీఎల్ టోర్నీ ను ప్రారంభించిన ఈ రెండు జట్టులు ఇప్పుడు మళ్ళీ 17 ఏళ్ళ తరువాత తిరిగి కోల్కతా లో సీజన్ ఓపెనర్ లో తలపడనున్నారు. ఆర్.సి.బీ – కె.కె.ఆర్ మధ్య జరిగేది కేవలం ఒక ఐపీఎల్ మ్యాచ్ మాదిరి కనిపించదు…ఈ మ్యాచ్ లో భాగమయ్యే ఆటగాళ్లు దీనిని ఒక మ్యాచ్ కన్నా ఎక్కువగా చూస్తారు.
Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
ఆర్.సి.బీ – కె.కె.ఆర్ మధ్య మొదలైన ఈ పోరు ఇప్పటిది కాదు. 2008 ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు బ్యాటర్ మెక్-కలం ఏకంగా 158 పరుగులు చేసి ఆ జట్టు స్కోరును ఒంటిచేత్తో 222 గా నిల్చోపెట్టాడు. ఈ భారీ లక్ష్య ఛేదన లో ఆర్.సి.బీ కేవలం 15 ఓవర్లలో 82 పరుగులకే చేతులెత్తేసింది.
అలాగే 23 ఏప్రిల్ 2013 న బెంగళూరు వేదికగా జరిగిన పూణే మ్యాచ్ లో గెయిల్ ఏకంగా 175 పరుగులు చేసి, జట్టు స్కోరును 263 కు పట్టుకెళ్ళాడు. అప్పటికి అదే అత్యధిక ఐపీఎల్ స్కోరు గా రికార్డులకెక్కింది. అయితే, సరిగ్గా 4 ఏళ్ళ తరువాత 23 ఏప్రిల్ 2017 న కోల్కతా వేదికగా బెంగళూరు VS KKR తో జరిగిన 132 పరుగుల ఛేదనలో RCB కేవలం 49 పరుగులకే ఆల్-అవుట్ అయ్యి, అత్యంత స్వల్ప స్కోరుతో ఒక చెత్త రికార్డు ను కూడా తన ఖాతాలో వేసుకుంది.
Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
ఇలా ఏప్రిల్ 23 తో బెంగళూర్ ఛాలెంజర్స్ కు ఉన్న ఒక ఘనమైన (263 పరుగుల) స్కోర్ రికార్డు ను అత్యంత గోరమైన (49 పరుగుల) చెత్త రికార్డు గా మార్చిన ఘనత కూడా KKR టీంకే దక్కింది. ఇలా ఈ రెండు టీం ల మధ్య ఐపీఎల్ సీజన్ ఎప్పుడు ఒక యుద్ధ వాతవరణాన్నే సృష్టిస్తుంది.
అయితే ఈ రెండు జట్లు తలపడిన ప్రతి మ్యాచ్ లోను దాదాపు RCB మీద KKR జట్టు ఎప్పుడు ఆట తోనే కాదు మాట తోను పై చేయి సాధిస్తూనే ఉంది. అందుకు కోల్కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కేవలం ఫీల్డ్ పైనే కాదు, ఫీల్డ్ బయట కూడా ఆర్.సి.బీ జట్టు పై చేసిన విమర్శలే ప్రత్యక్ష ఉదాహరణలు. కప్పు లేకుండా ఎందుకు ఇంత హడావుడి చేస్తారని ఒకటి రెండు సార్లు మీడియా ముఖంగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
అయితే KKR ఇప్పటికే 2012 , 2014 , 2024 లో మూడు సార్లు ఐపీఎల్ కప్పును చేజిక్కించుకుని ఐపీఎల్ విజేతగా నిలిచింది. కానీ RCB మాత్రం మూడు సార్లు ఫైనల్ మ్యాచ్ వరకు వెళ్లి ఓటమి నిరాశతో వెనుతిరిగింది. మరి, వాటన్నిటికీ ఆర్.సి.బీ జట్టు ఈసారి 17 ఏళ్ళ తరువాత మళ్ళీ సీజన్ ఓపినింగ్ మ్యాచ్ తో కోల్కతా ను ఓడించి, ఫైనల్ లో కప్పు కొట్టి బదులిస్తారేమో చూడాలి..!