ys-jagan-face-on-rice-vans-ambulance

జగన్‌ ప్రచారయావ గురించి అందరికీ తెలిసిందే. స్కూల్లో పిల్లలకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలు, చిక్కీల మొదలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వరకు ఎక్కడ చూసినా జగన్‌ బొమ్మలే.

Also Read – ఇద్దరు ఏకాకులు… ఇద్దరు మిత్రుల కధ

సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంక్షేమ పధకాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, 108 అంబులెన్సులు, బియ్యం సరఫరా వాహనాలు, అధికార పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, వివిద శాఖల వెబ్‌సైట్‌లలో… ప్రతీదానిపై జగన్‌ బొమ్మలే. ప్రతీ చోట వైఎస్సార్, జగన్ పేర్లే.

చివరికి టిడిపి హయాంలో కట్టించిన లక్షలాది టిడ్కో ఇళ్ళను జగన్‌ ప్రభుత్వం వైసీపి పూర్తిచేసి లబ్ధిదారులకు అందించకపోయినా వందల కోట్లు ఖర్చు చేసి అన్నిటికీ వైసీపి రంగులు వేయించేసింది.

Also Read – కండువాలున్నాయా… ఉంటే మేము వచ్చేస్తాం!

జగన్‌ ప్రచార యావ ఇప్పుడు అధికారం చేపట్టిన టిడిపి కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా, అదనపు ఆర్ధిక భారంగా కూడా మారింది.

ఇప్పటికే ఆయా శాఖలు సిబ్బంది కార్యాలయాల బోర్డులపై జగన్‌ బొమ్మలు, పేర్లు కనబడకుండా కాగితాలు అంటిస్తున్నారు లేదా ఆ మేరకు వేరే రంగు పూస్తున్నారు. వీటన్నిటినీ పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్త రంగులు వేయాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.

Also Read – నాకు కష్టం వచ్చింది.. అందరూ రండి!

ఖాళీ ఖజానా, అప్పులు, వడ్డీలతో పాలన ప్రారంభించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వీటిని వదిలించుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టగలదా లేదా? అసలు ఖర్చుపెట్టాలా వద్దా? అని ఆలోచన చేయక తప్పడం లేదు.

స్కూలు పిల్లలకు ఇచ్చే నోటు పుస్తకాలపై, స్కూలు బ్యాగులపై రెండు నెలల క్రితమే జగన్‌ బొమ్మలు ముద్రించారు. స్కూలు పిల్లల ఆరోగ్య వివరాలు నమోదు చేసేందుకుగాను ఆర్‌బీఎస్‌కె పుస్తకాలను కూడా జగన్‌ బొమ్మతోనే ముద్రించారు. ఇప్పుడు వీటన్నిటినీ అలాగే ఉంచేయాలా లేదా అన్నిటినీ వెనక్కు తీసుకొని మళ్ళీ కోట్లు ఖర్చు చేసి కొత్తవి సరఫరా చేయాలా?

ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు జగన్‌ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు కానీ రూ.19.80 కోట్లు ఖర్చు చేసి జగన్‌ బొమ్మతో 1.49 ఆరోగ్యశ్రీ కార్డులు ముద్రించింది. .

ఈ 5 ఏళ్ళ జగన్‌ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేయించారు. జగన్‌ ప్రభుత్వం క్రీడలకు సదుపాయాలు కల్పించి క్రీకారులను ప్రోత్సహించకపోయినా క్రికెట్ స్టేడియంల వద్ద కోట్లు ఖర్చు చేసి వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేసింది. వాటన్నిటినీ ఉంచాలా తొలగించాలా?తొలగిస్తే వైసీపితో కొత్త ఇబ్బందులు మొదలవుతాయి.

తాము అధికారంలోకి రాలేకపోయినా అమరావతి రాజధాని కాకూడదనే దురుదేశ్యంతో పేదలకు భూములు పట్టాలు వేసి పంచిపెట్టేశారు. అలాగే కొన్ని భూములను, చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన భవనాలను ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు దీర్గకాలిక లీజుకు ఇచ్చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోవడం ఎలా?

అమరావతిని 5 ఏళ్ళు పాడుబెట్టేయడం వలన వాటన్నిటిని సరిచేసుకోవడానికి అయ్యే ఖర్చు అధనపు భారమే. ఈవిదంగా జగన్‌ అధికారంలో లేనప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, రాష్ట్రానికి పెనుభారం మిగిల్చేశారు. ఈ తప్పులను సరిదిద్దాడానికే వందల కోట్లు ఖర్చు చేయక తప్పని పరిస్థితి కల్పించారు. ఏ చేతికి పియ్యి అంటుకున్నా కంపు కంపే కనుక భరించాలా… కడుక్కోవాలా?