జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినా, లండన్ వెళ్ళినా సొంత పనుల కోసమే వెళ్ళారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కాదు. ఒకే ఒక్కసారి దావోస్ సదస్సుకి వెళ్ళారు. అది కూడా ప్రత్యేక విమానంలో లండన్ మీదుగా వెళ్ళి వచ్చారు.
ఆ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి తేలేకపోయారు కానీ కొన్ని కోట్లు రూపాయలు విమాన ఖర్చులయ్యాయి. ఆ తర్వాత మరెన్నడూ జగన్, గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాధ్ దావోస్ వెళ్ళే ఆలోచన చేయలేదు.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కించేశారా?
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రప్పించినా వాటిలో ఉద్యోగాలు చేస్తే డబ్బే ఇస్తారు. కనుక అదేదో తనే ఇచ్చేస్తే మరిక ఆ గోల ఉండదనుకున్నారో ఏమో సంక్షేమ పధకాల పేరుతో 5 ఏళ్ళు అప్పులు చేసి, ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టేసి ప్రజలకు ‘మేలు’ చేసి పోయారు.
అదే… తెలంగాణలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కొన్ని రోజులకే దావోస్ వెళ్ళి వచ్చారు. ఓ 10-15,000 కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు కూడా.
Also Read – ఇంతకీ షర్మిల బాణం గురి ఎవరివైపు?
మళ్ళీ శనివారం ఉదయం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఈసారి వారం రోజులు అమెరికాలోనే మకాం వేసి వివిద బహుళజాతి కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్ వెళ్ళి కొరియన్ కంపెనీలతో చర్చించనున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి బృందం ఈ రెండు పర్యటనలలో ప్రత్యేక విమానాలలో వెళ్ళలేదు. సాధారణ ప్రజలు ప్రయాణించే విమానాలలోనే వెళ్ళి వస్తున్నారు. కనుక సాధ్యమైనంత వరకు పొదుపుగా వ్యవహరిస్తూ, ప్రజాధనం వృధా చేయకుండా వారి బృందం పెట్టుబడుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?
కానీ జగన్ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తేలేదు. రాజధాని నిర్మించకపోగా అమరావతిలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన కట్టడాలను ఎందుకూ పనికిరాకుండా చేసేశారు.
చంద్రబాబు నాయుడుపై ద్వేషం ఉంటే ఆయనతో ఆ లెక్కలు చూసుకోవాలి. కానీ వేలకోట్ల ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను కూల్చివేసే, పనికిరాకుండా చేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు.
తన విలాసాల కోసం, తన పైశాచికానందం కోసం ప్రజాధనం వృధా చేయడమే కాక మళ్ళీ నిసిగ్గుగా చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అంటే ఎన్నికలలో ప్రజలు గడ్డిపెట్టినా బుద్ధి రాలేదనుకోవాలి.