ys-jagan-revanth-reddy

గత 5 ఏళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా నిలిచినప్పుడు ప్రజలందరూ అవమానంగా భావించేవారు. జగన్‌ అస్తవ్యస్త పాలనలో అవినీతి, ఆరాచకాల గురించి ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కధకధలుగా చెప్పుకునేవారు.

Also Read – విజన్ 2029 కూడా అవసరమేగా?

ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నెలనెలా జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని పార్లమెంటు సమావేశాలలో చెప్పుకునేవారు. రాష్ట్రంలో పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం చూసి అందరూ దిగ్బ్రాంతి చెందేవారు.

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేవి కావు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటికి వస్తే ఏం బాంబు పేలుస్తారో అని ప్రజలు భయపడుతుండేవారు.

Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?

కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవన్నీ మంత్రం వేసిన్నట్లు ఒక్కసారిగా మాయం అయిపోయాయి. మళ్ళీ మెల్లగా ఏపీకి పూర్వ వైభవం వస్తోంది.

కానీ ఇప్పుడు తెలంగాణలో రివర్స్ గేర్ పడిన్నట్లు అనిపిస్తోంది. ఆనాడు రాజధాని లేనప్పుడు ఏపీ ప్రజలు ఏవిదంగా అవమానపడేవారో ఇప్పుడు, తెలంగాణ తల్లి విగ్రహం వివాదాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రజలు అవమానంగా భావిస్తున్నారు.

Also Read – మీడియా వారు జర భద్రం…!

ఈ విషయంలో ఎవరి అభిప్రాయలు, ఎవరి వాదనలు వారికి ఉండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వివాదం మొదలైంది కదా?ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎప్పుడు? ఏవిదంగా? అనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. బహుశః న్యాయస్థానమే చెప్పాలేమో?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు మురిసిపోతూ విజయోత్సవాలు నిర్వహించుకుంటుంటే, కేవలం ఓకే ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తెలంగాణ పరువు తీసేసిందని బిఆర్ఎస్ పార్టీ నేడు ఓ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.

నాడు తెలంగాణ అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేదని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా అస్తవ్యస్తమేనని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.

వాటి రాజకీయ వాదోపవాదాలను పక్కన పెట్టి చూసినా, ఆనాడు జగన్‌ రివర్స్ గేర్ పాలన సాగిననట్లుగానే ఇప్పుడు తెలంగాణలో కూడా సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదే సమయంలో ఏపీలో అభివృద్ధిపనులు వేగం పుంజుకుంటుండటంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏపీతో తమ రాష్ట్రాన్ని పోల్చి చూసుకోవడం మొదలుపెట్టారు.

బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా లోలోన ఇదే అనుకుంటుండవచ్చు. కానీ వారు అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు ఏపీ సిఎంగా ఉన్నందున ఏపీలో అభివృద్ధి జరుగుతోందనే ముక్క పైకి చెప్పలేకపోతున్నారు అంతే! కానీ తెలంగాణ వెనుకబడిపోయిందని గట్టిగా వాదించేందుకు ఏదో రోజు వారి నోటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెప్పడం ఖాయమే.




ప్రజల ఆకాంక్షలు గుర్తించకుండా రాజకీయాలతో కాలక్షేపం చేయకూడదని, చేస్తే ఏమవుతుందో జగన్‌ నిరూపించి చూపారు. అవసరం లేనప్పుడు రివర్స్ గేర్ వేసి నడిపిస్తే ప్రమాదమే కదా?