ఈ నెల 9న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా సిఎం రేవంత్ రెడ్డి మీడియా ద్వారా మాజీ సిఎం కేసీఆర్‌ని, బీజేపి ఎంపీలు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించారు.
ప్రోటోకాల్ ప్రకారం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్ళి వారికి ఆహ్వాన పత్రికలు అందించి సగౌరవంగా ఆహ్వానిస్తారని చెప్పారు. మంత్రి పొన్నం వెంటనే కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురి కార్యాలయ సిబ్బందికి ఈ విషయం తెలియజేసి, వారి అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా కోరారు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల పట్ల చాలా హుందాగా వ్యవహరిస్తోందని అర్దమవుతూనే ఉంది.
Also Read – కేటీఆర్.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…
కానీ వారు ముఖ్యంగా.. కేసీఆర్ ఈ ఆహ్వానాన్ని మన్నించలేరు.. కనుక తిరస్కరించవచ్చు. ఎందువల్ల అంటే, నేటికీ ఆయన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతున్నారు. సహించలేకపోతున్నారు. అందువల్లే శాసనసభ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకుంటారు.
కనుక ముఖ్యమంత్రి హోదాలో తాను కట్టించిన సచివాలయంలో.. అదీ తన కోసం ముచ్చటపడి కట్టించుకున్న ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి కూర్చోవడం అసలే సహించలేరు. అటువంటప్పుడు సిఎం హోదాలో రేవంత్ రెడ్డి, ఆయన చుట్టూ కాంగ్రెస్ మంత్రులు, వారికి విధేయంగా మెసులుకుంటున్న అధికారులను కేసీఆర్ చూసి ఓర్వలేరని వేరే చెప్పక్కరలేదు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
మరో ముఖ్యవిషయం ఏమిటంటే కేసీఆర్ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం ఆయన కూతురు కల్వకుంట్ల కవిత రూపురేఖలతో ఉందని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి మరో కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహం చేయించిన్నట్లు సమాచారం.
ఆ విగ్రహావిష్కరణకి ముహూర్తం సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9నే పెట్టారు. కనుక కేసీఆర్‌ని ఎంత గౌరవంగా ఆహ్వానించినా వస్తారా?అంటే రాకపోవచ్చు.
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
వస్తే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అంగీకరించిన్నట్లే అవుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ పాచికలో పావుగా మారిన్నట్లే అవుతుంది కూడా.
కానీ రాకపోతే మంత్రిని పంపించి సగౌరవంగా ఆహ్వానించినా రాకుండా మొహం చాటేసి తెలంగాణ తల్లిని తద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ అవమానించారని రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపించకుండా ఉండరు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వస్తే రావచ్చు లేకుంటే ఏదో అభ్యంతరం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ కేసీఆర్‌ని పెద్దమనిషి అని గౌరవిస్తూనే రేవంత్ రెడ్డి ఇరుకున పెడుతున్నారు. ఈ మర్యాద, గౌరవాలు నాకు వద్దని కేసీఆర్ అనుకునేలా చేస్తున్నారు కదా!