Review On Chandrababu Naidu's One Year Rule

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది పాలన ఏవిదంగా సాగింది? భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి? అని చర్చించుకునే ముందు ఓ విషయం తప్పక చెప్పుకోవాలి.

చంద్రబాబు నాయుడు 2014 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది.

Also Read – ప్రధాని, సిఎం స్థాయి ఊరికే లభిస్తుందా బ్రదర్?

2024లో బాధ్యతలు చేపట్టినప్పుడు 5 ఏళ్ళ జగన్‌ విధ్వంస పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి 2014 కంటే దారుణంగా మారింది.

రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టాన్ని అర్దం చేసుకోవచ్చు. కనుకనే 2014-2019 వరకు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయి. కానీ జగన్‌ ప్రభుత్వ వేధింపులు, ఆరాచకాలకు భయపడి ఎవరూ రావడం మానుకున్నారు.

Also Read – రేవంత్ రెడ్డి వంద సీట్ల నమ్మకం ఎలా?

జగన్‌ దిగిపోయినా నేటికీ భయపడుతూనే ఉన్నారని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా నిన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే జగన్‌ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారన్న మాట!

‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ సాక్షిలో బురద జల్లించడం, ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మూకలు చెలరేగిపోయి మహిళలు, పోలీసులపై రాళ్ళ దాడులు చేయించడమే ఇందుకు తాజా నిదర్శనాలు.

Also Read – మామిడి సీజన్ ముగుస్తుంటే ఇప్పుడా పలకరింపులు?

రాష్ట్రానికి మేలు చేశానని చెప్పుకుంటున్న జగన్‌ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం శ్రమించవలసి వస్తుండటం ఎంత దురదృష్టకరం?

ఈ నేపధ్యంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ఓ పక్క జగన్‌, వైసీపీ నేతలను రాజకీయంగా ఎదుర్కొంటూనే, వారి అవినీతి, అక్రమాలను వెలికితీసి కేసులు నమోదు చేసి కట్టడి చేస్తూనే, అభివృద్ధి, సంక్షేమ పధకాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ ఏడాది కాలంలోనే రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయులు చేసుకోగా వాటిలో రూ.4.95 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు మొదలయ్యి వివిద దశలలో ఉన్నాయి.

అమరావతి, పోలవరం పనులకు నిధులు సమకూర్చుకొని పనులు మొదలు పెట్టించారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలని సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రాజెక్టులు సాధించారు.

సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌, వైసీపీ పదేపదే ఆరోపిస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే నెలకు రూ.4,000 పింఛన్ చెల్లిస్తున్నారు.

ఏడాది పూర్తవకుండానే ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మత్స్యకారులకు భరోసా, నేటి నుంచి తల్లికి వందనం, ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బసు ప్రయాణ సౌకర్యం వంటి పధకాలు అమలుచేస్తున్నారు. ముఖ్యంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించి చక చకా ఆ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పధకాలు, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అది వేరేగా చెప్పుకుందాం.




జగన్‌ 5 ఏళ్ళలో చేయలేక చేతులెత్తేసిన పనులను సిఎం చంద్రబాబు నాయుడు కేవలం ఏడాది పాలనలోనే సాధించారు. ఇదే వేగంతో పనులు జరిగి పూర్తయితే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలే సమూలంగా మారిపోవడం ఖాయం.