
మెగా కుటుంబం మీద, ఆ హీరోల సినిమాల మీద ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తద్వారా మెగా అభిమానులను రెచ్చకొట్టడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒక అలవాటుగా మారిపోయింది.
Also Read – అమరావతిలో బసవతారకం….
తాజాగా థియేటర్లకు వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ మీద, ఆ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల మీద తన సోషల్ మీడియాలో సైటికల్ ట్వీట్ వేశారు ఆర్జీవీ. దీనికి గాను మెగా VS అల్లు గా సాగుతున్న సోషల్ మీడియా వార్ ను వినియోగించుకుంటూ బన్నీ పుష్ప సినిమాతో చెర్రీ GC మూవీ ని పోలుస్తూ మెగా అభిమానులను మరోసారి గిల్లారు ఆర్జీవీ.
రామ్ చరణ్ GC మూవీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే టాక్ నడుస్తున్న వేళ ఈ మూవీ తొలి రోజు 186 కోట్లు వసులు చేసిందంటూ మూవీ మేకర్స్ పోస్టర్ విడుదల చేసారు. దీని పై స్పందించిన ఆర్జీవీ చెర్రీ GC కి 186 కోట్లు వస్తే బన్నీ పుష్ప సినిమా కు 1860 కోట్లు ఉండాలి, అలాగే GC మేకింగ్ కి 400 కోట్లు అయితే RRR 4500 కోట్లు అవ్వాలి అంటూ పోస్ట్ చేసారు.
Also Read – ట్రంప్-మోడీ భేటీ ఎవరిది పైచేయి?
అలాగే ఈ నమ్మశక్యం కానీ అబద్దపు అంకెల వెనుక ఎవరున్నారో తనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆ మూవీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఉండరు అంటూ రాసుకొచ్చారు. దీనికి తోడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చూసాక అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ళ మీద పడాలనిపించింది అంటూ బన్నీ పుష్ప తో GC ను పోలుస్తూ మరోసారి మెగా అభిమానులను రెచ్చకొట్టారు.
అయితే ఒకప్పటి తెలుగు టాప్ డైరెక్టర్ గా ఇప్పటి సినిమాల మీద, వాటి కలెక్షన్ల మీద తన అభిప్రాయాన్ని పంచుకోవడం కానీ, మూవీ బడ్జెట్ల మీద విశ్లేషణ చేయడం కానీ ఎవరు తప్పుపట్టారు. కానీ కావాలని టార్గెటెడ్ గా ఒక కుటుంబం నుంచి విడుదలైన హీరోల సినిమాల మీద మాత్రమే ఆర్జీవీ ఈ రకమైన సెటైరికల్ ట్వీట్స్ వేయడం మాత్రం ముమ్మాటికీ వారి అభిమానులను రెచ్చకొట్టే ధోరణే అనేది సుస్పష్టం అవుతుంది.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
అయితే మెగా అభిమానులు కూడా బూతు సినిమాలు తీసే నీ లాంటి వారికీ సమాజానికి సందేశాలను అందించే ఇటువంటి సినిమాల గురించి మాట్లాడే అర్హత లేదంటూ, మీ వ్యూహాలు, శపధాలు,సెటైర్లు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమంటూ ఆర్జీవికి అదే స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు.