
కింగ్ అందుకుంటాడా.? శర్మ కొనసాగిస్తారా.?
గడిచిన కొంత కాలంగా భారత వన్ డే ఇంకా టెస్ట్ సారధి ‘రోహిత్ శర్మ’ ఫామ్ మరియు కింగ్ కోహ్లీ జట్టులో వారి చోటు పై అనేకానేక ప్రశ్నలు, విమర్శలు వింటూనే వస్తున్నాం. క్రికెట్ లో మహా మహులు సైతం శర్మ ను విమర్శించారు, కోహ్లీ ఆటతీరును తప్పుబట్టారు.
Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!
ఇలా ఆడితే, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడవసర్లేదని, రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవమైనా దక్కుతుందని ఇలా ఇంటా బయట ఎందరో ఎన్నో విమర్శలు చేశారు. గతేడాది టి-20 ప్రపంచ కప్ ను నెగ్గిన తరువాత నుండి రోహిత్ బ్యాటింగ్ మరియు అతని ఆత్మస్థైర్యం పూర్తిగా మారిపోయింది. అలాగే కోహ్లీ కూడా మైదానంలో మునుపటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నారు.
తొలుత విఫలమయినా, వారే మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వస్తారులే అనుకున్న వారందరి ఆశలు అత్యాశలే అన్నట్టుగా వీరిద్దరి బ్యాటింగ్ శైలి మారిపోయింది. దీనితో సిరీస్ ల పై సిరీస్ లు ముగుస్తున్నాయి కానీ, శర్మ, కోహ్లీ మాత్రం మునుపటి మెరుపులు మెరిపించలేకపోయారు.
Also Read – కళ్ళు మూసుకుంటానికి హోదా కావాలా.?
వరుసగా గడిచిన గత 6 -7 నెలల నుండి శర్మ బ్యాట్ నుండి ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా చూడలేకపోయిన క్రికెట్ అభిమానుల ఆకలి తీర్చారు రోహిత్. తన పై వస్తునం విమర్శలకు, తనకు ఎదురవుతున్న అవమానాలకు నోటితో కాకుండా బ్యాట్ తో బదులిచ్చారు రోహిత్. తన ఆవేశాన్నంతా తనలోనే దాచుకుని, ఇంగ్లాండ్ పై జరిగిన రెండవ వన్ డే లో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు.
తొలి ఓవర్ నుండే తన బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుందని రుచి చూపించిన హిట్ మ్యాన్, 76 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసి తనపై వేలెత్తిన వారందరికీ తన బ్యాట్ పవర్ తగ్గలేదు అంటూ బదులిచ్చాడు. 90 బంతుల్లోనే ఏకంగా 119 పరుగులు చేసి, భారత్ ముందున్న కొండంత 305 పరుగుల లక్ష్యాన్ని చాలా చిన్నదిగా మార్చేశాడు.
Also Read – కొత్త జట్టుకు పాత గుర్తులు ఇవ్వగలడా..?
ఈ సెంచరీ తో తన అంతర్జాతీయ కెరీర్లో 49 వ శతకాన్ని అందుకున్నాడు రోహిత్. వన్ డే ల్లో ఇది తనకు 32 వ శతకం. విరాట్, సచిన్ తరువాత వన్ డే మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు హిట్ మ్యాన్.
భారత జట్టు వంటి ఒక ఉన్నత జట్టు కు సారధి గా ఉంటూ, తన బ్యాటింగ్ ను అందరూ వేలెత్తి చూపిన సమయంలో, సెంచరీ కి కేవలం 4 పరుగుల దూరంలో ఉండగా, ఆ సెంచరీ ను సిక్సర్ తో అందుకున్నాడంటే…అది “హిట్ మ్యాన్ రోహిత్ శర్మ” కాకా మరెవరు అనేలా చెలరేగిపోయారు.
దీనితో అప్పుడు విమర్శలను ఎదుర్కున్న రోహిత్ ఇప్పుడు ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ “అతడిని ఎక్కువ రోజులు సైలెంట్ లో ఉంచలేరు” …బ్యాట్ తో సమాధానం చెప్పాడు హిట్ మాన్ అంటూ ట్వీట్ చేసారు. అయితే శర్మ ఫామ్ లోకి రావడంతో ఇక కోహ్లీ మీద మరింత ఒత్తిడిని పడనుంది.
చూడాలి మరి, రోహిత్ ఈ ఫామ్ ను ఇలానే కొనసాగిస్తూ తన పై వస్తున్న విమర్శలకు చెక్ పెడతారా.? లేదా అనేది. అలాగే కింగ్ కోహ్లీ కూడా తన ఫామ్ అందుకుని భారత టీం కి మరిన్ని విజయాలను, క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని అందిస్తారా.?