ఒకప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఓడిపోయినా మళ్ళీ ఎన్నికల వరకు 5 ఏళ్ళు కాలక్షేపం లేదా మనుగడ సాగించడం పెద్ద కష్టంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ‘ఏఐ టెక్నాలజీ’ వచ్చి అన్నీ మారిపోతున్నట్లే, రాజకీయాలలో కూడా జగన్ కక్ష సాధింపులు, వేధింపుల ట్రెండ్ స్టార్ట్ చేయడంతో, అధికారం లేకుండా నెల రోజులు కూడా మనుగడ సాగించడం కూడా ఎంతో కష్టంగా ఉంది.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిడిపి, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన గత 5 ఏళ్ళు ఎన్నో బాధలు, అవమానాలు పంటి బిగువన భరించి, జగన్‌ని గద్దె దించి అధికారంలోకి రాగలిగాయి. కనుక ఇప్పుడు జగన్, వైసీపి వంతు వచ్చిందనుకోవచ్చు.
Also Read – ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఆంధ్రా వద్దు.. తెలంగాణ ముద్దు!
అయితే వారిలాగ జగన్ తన పార్టీ నేతలని, కార్యకర్తలని ఆదుకుంటారా? అంటే డౌటే. ఎందుకంటే సొంత తల్లి, చెల్లినే పట్టించుకోలేదు. తాను సృష్టించిన వాలంటీర్లు రోడ్డున పడితేనే పట్టించుకోలేదు. కనుక అధికారంలో ఉన్నప్పుడు తన కోసం ‘ఓవర్ యాక్షన్’ చేసి కేసులలో చిక్కుకున్న నేతలని పట్టించుకుంటారని అనుకోలేము.
ఈవిషయం గ్రహించిన కొందరు నేతలు ఇప్పటికే రాజకీయ సన్యాసం ప్రకటించగా, రోజా, బాలినేని వంటివారు అలకపాన్పులు ఎక్కారు. బాలినేనిని జగన్ పట్టించుకోలేదు కానీ రోజా కోసం పెద్దిరెడ్డి మనుషులు కేజే కుమార్, కేజే శాంతి, వారి బంధుమిత్రులు అందరినీ మెడ పట్టుకొని పార్టీ నుంచి గెంటేశారు.
Also Read – ప్యాలస్‌లో ప్రతిపక్షం… సోషల్ మీడియాలో రాజకీయాలు!
వాళ్ళని బయటకు గెంటేస్తేనే మళ్ళీ నగరిలో అడుగుపెడతానని లేకుంటే చెన్నైలోనే ఉండిపోయి నటుడు విజయ్ పెట్టిన పార్టీలో చేరిపోతానని బ్లాక్ మెయిల్ చేసిన్నట్లు తెలుస్తోంది. మంచి నోరున్న రోజాని వదులుకోవడం కంటే వారిని వదులుకోవడమే మేలని జగన్ భావించి ఉండవచ్చు.
మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని దెబ్బ తీయలేకపోయినా ఓడిపోయిన తర్వాత అయినా దెబ్బ తీశానని రోజాకి సంతోషపడి ఉండవచ్చు. కానీ ఇందుకు పెద్దిరెడ్డి రోజాపై ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారా?అనే ప్రశ్నకు కాలమే జవాబు చెపుతుంది.
Also Read – అవమానించిన వాడే ఆదర్శమయ్యాడా.?
ప్రస్తుత పరిస్థితులలో జిల్లా, నియోజకవర్గం స్థాయిలో వైసీపి పగ్గాలు ఎవరిని లభించినా అది ముళ్ళ కిరీటమే… జేబులు ఖాళీ చేసేస్తుందని అని వేరే చెప్పక్కర లేదు. పైగా ఇప్పుడు ఇదివరకులా నోటి తీట ప్రదర్శించడానికి లేదు. కనుక వైసీపి పదవులతో అల్పసంతోష పడేవారిని చూసి జాలి పడాలి.