
సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తే, ఆ తర్వాత ఆదాయపన్నుశాఖ వారు వచ్చి ఆ దర్శక నిర్మాతలను పలకరిస్తుంటారు… అని మరోసారి స్పష్టమైంది. వారి పలకరింపు చాలా ఖరీదైన వ్యవహారం.
ఈసారి ఆదాయపన్నుశాఖ వరుసగా మూడో రోజు కూడా నిర్మాత దిల్‌రాజుతో సహా పలువురు సినీ ప్రముఖులు, వారి సంస్థలలో సోదాలు నిర్వహిస్తుండటం గమనిస్తే, సినీ పరిశ్రమలో తెరవెనుక మరేదో జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read – అమరావతిలో బసవతారకం….
సినీ పరిశ్రమలో ఉన్నవారి మద్య విపరీతమైన పోటీకి తోడు ఒకరినొకరు దెబ్బ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు కూడా.
కనుక పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఆ దర్శక నిర్మాతలపై అసూయా ద్వేషాలతో ఎవరైనా ఆదాయపన్ను శాఖకి ఉప్పందించి ఉండవచ్చని అందుకే మూడోరోజు కూడా సోదాలు నిర్వహించి, రికార్డులు తిరగేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
ఇదీకాక పుష్ప-2, సంక్రాంతి బరిలో దిగిన మూడు పెద్ద సినిమాలు విపరీతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ‘కలెక్షన్స్ విరగదీశాము… రికార్డులు బద్దలైపోతున్నాయంటూ..’ చాలా గొప్పగా చెప్పుకున్నారు.
అది సినిమా ప్రమోషన్స్‌లో భాగమే అయినప్పటికీ, ఆదాయపన్ను శాఖని ఆకర్షించడానికి ఆ అతి ప్రచారం కూడా ఓ కారణంగానే కనిపిస్తోంది.
Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..
కనుక ఇకనైనా సినీ దర్శక నిర్మాతలు, వారి నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో సినిమా ‘కలెక్షన్స్ ప్రచారాలు, పోటీలు’ తగ్గించుకుంటే వారికే మంచిది. లేకుంటే సినిమా రిలీజ్ కాగానే ఆదాయపన్ను శాఖ అధికారులు పలకరింపులకు సిద్దపడాల్సిందే!