తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత నా సామ్రాజ్యంలో మరెవరూ ఉండకూడదని అనుకున్నారు. కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను ఎత్తుకుపోయి రెండు పార్టీలను తుడిచిపెట్టేశామని, ఇక తనకు ఎదురేలేదని సంబరపడ్డారు. కానీ ఆయన సంతోషం ఎంతో కాలం నిలుయలేదు. గంగిగోవులాంటి కాంగ్రెస్ స్థానంలోకి పెద్దపులి వంటి బీజేపీ దాని వెనుక మోడీ, అమిత్ షాలు వచ్చారు. ఆ తర్వాత కధ తెలిసిందే.
అలాగే తెలంగాణలో టిడిపిని తుడిచిపెట్టేశామని సంతోషపడ్డారు. పనిలో పనిగా ఏపీలో చంద్రబాబు నాయుడుతో తనకు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందనుకున్నారు కనుక 2019 ఎన్నికలలో ఆయనని గద్దె దించేసి మరోసారి తన ప్రతాపం చాటుకున్నారు కూడా.
Also Read – ఏపీలో మందుబాబులకు విముక్తి దక్కిందా..?
అయితే ఏ సినిమాలో అయినా హీరోకి ధీటైన విలన్ ఉన్నప్పుడే ఆ సినిమా రక్తి కడుతుంది. హీరో గొప్పదనం తెలుస్తుంది. అదేవిదంగా తెలంగాణలో టిడిపి అనే విలన్‌ని కేసీఆర్ కాపాడుకొని ఉండి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సెంటిమెంట్ పండించుకోగలిగేవారు. కానీ టిడిపిని తుడిచిపెట్టేసి, చంద్రబాబు నాయుడుని గద్దె దించేయడంతో సెంటిమెంట్ రాజకీయాలు చేయడానికి వీలులేకుండా పోయింది.
కనుక సోనియా, రాహుల్ గాంధీలని, మోడీ, అమిత్ షాలు మన రాష్ట్రాన్ని దోచేసుకోవడానికి వస్తున్నారంటూ మళ్ళీ సెంటిమెంట్ రగిలించడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవేవీ ఫలించకపోగా బెడిసికొట్టడంతో ఎన్నికలలో ఓడిపోయారు.
Also Read – ప్రభుత్వ సభలంటే ఇలా ఉండాలా.?
అంటే తెలంగాణలో టిడిపి, పొరుగు రాష్ట్రంలోనైనా చంద్రబాబు నాయుడు ఉండటం చాలా అవసరమని కేసీఆర్ గ్రహించారో ఏమో, మొన్న తన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేత “రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ” ఓ పంచ్ డైలాగ్ వేయించారు.
అయితే ఆయన అత్యుత్సాహంతో “బ్రతకడానికి వచ్చిన ఆంద్రావాళ్లు” అంటూ నోరు జారి అంతా కంపు కంపు చేసేశారు.
Also Read – దువ్వాడకి జగన్ అవసరం లేదా మాధురీ మేడమ్?
కానీ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తుండటం గమనిస్తే, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మనుగడకు టిడిపి కూడా అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లే అనిపిస్తోంది. అదే నిజమైతే కేసీఆర్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, కేసీఆర్‌ని ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడే బిఆర్ఎస్ పార్టీని బ్రతికించాలన్న మాట!