Srilakshmi Srinivasa Corporation

ప్రభుత్వాలు పని చేయడానికి కొన్ని వ్యవస్థలు తప్పనిసరి. కానీ కాలక్రమంలో అవసరం లేని కొన్ని వ్యవస్థలు పుట్టుకొస్తుంటాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అటువంటి నిరార్ధకమైన అనేక వ్యవస్థలను రద్దు చేశారు. కొన్నిటిని వేరే శాఖలలో విలీనం చేశారు. తద్వారా ప్రభుత్వం వందల కోట్ల అదనపు భారం తగ్గించుకున్నారు.

కానీ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేని సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు సృష్టించి వాటిని తన పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. ఆ లక్షల మందికి తమ సాక్షి పేపర్ని కొనుగోలు చేసేందుకు వందల కోట్లు చెల్లించేవారు. అంటే వారి పేరుతో సాక్షి పేపర్‌కి కూడా లబ్ధి కలిగించుకున్నారన్న మాట! సాక్షిలో సంక్షేమ పధకాలు ప్రకటనలకు ఏటా వందల కోట్లు ముట్టజెప్పేవారు. ఈ భారం ప్రభుత్వంపై పడితే, దానిని ప్రజలకి బదిలీ చేసేవారు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

వైసీపీకి మాత్రమే పనికొచ్చే ‘ఆరో వేలు’ వంటి అటువంటి మరో వ్యవస్తే టీటీడీలో శ్రీలక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ కూడా. టీటీడీ దశాబ్ధాలుగా వేలాదిమందిని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకొని వారి సేవలను వినియోగించుకుంటోంది. వారందరికీ నెలనెలా సకాలంలో జీతాలు చెల్లిస్తుండేది.

కానీ ఈ నియామకాల ప్రక్రియని వైసీపీ నేతల చేతికి అప్పగించి వారికి లబ్ధి కలిగించేందుకుగాను శ్రీలక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్‌ని సృష్టించారు. దాని ద్వారా వైసీపీ నేతలు తమకు నచ్చినవారినీ, అన్యమతస్థులను టిటిడీలోకి జొప్పించేవారు.

Also Read – శాసనసభ సమావేశాలు: జగన్‌ స్టోరీ మామూలే!

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాలు.. వాటిలో లక్షల మంది అధికారులు, ఉద్యోగులు ఉండగా, వైసీపీ కోసం వాటికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థని సృష్టించిన్నట్లే, టీటీడీకి సమాంతరంగా శ్రీలక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు టీటీడీ దానిని రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ దానిని జగన్‌ ఏర్పాటు చేసినందునే చంద్రబాబు నాయుడు అసూయతో రద్దు చేయిస్తున్నారని, దాని వలన టీటీడీలో చేస్తున్న 23,000 మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అప్పుడే వైసీపీ, దాని సొంత మీడియా పాట మొదలు పెట్టేశాయి.

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!


కేవలం రూ.5,000 జీతం కోసం వైసీపీకి 5 ఏళ్ళపాటు వెట్టి చాకిరీ చేసిన లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడితే పట్టించుకోని వైసీపీ, టీటీడీలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకుంటున్నవారి గురించి మొసలి కన్నీళ్ళు కార్చుతోంది. కానీ అంత మాత్రాన్న మొసలి నైజం మారదు కదా?