
ఏపీలో సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా నేటికీ వైసీపీ గూండాల చేతుల్లో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతుండటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
చిత్తూరు జిల్లాలో ఓ నిఖార్సైన టీడీపీ కార్యకర్తని వైసీపీకి చెందిన వెంకటరమణ తదితరులు పట్టపగలు అందరూ చూస్తుండగా కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేశారు.
Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?
శనివారం ఉదయం మండలంలోని కృష్ణాపురంలో కాగితి రామకృష్ణనాయుడు (55) అనే టీడీపీ కార్యకర్తని వైసీపీకి చెందిన వెంకటరమణ తదితరులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
మొదట వారు ఆయన కుమారుడు సురేష్ కుమార్‌పై కత్తులతో దాడి చేయగా అతను వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అదే సమయానికి అటుగా ట్రాక్టర్‌పై వస్తున్న రామకృష్ణనాయుడిని చుట్టుముట్టి ఆయనపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు.
Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?
కాగితి రామకృష్ణనాయుడు మొదటి నుంచి టీడీపీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని, ఆయన అనుచరులను ధైర్యంగా ఎదుర్కొంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ కారణంగా ఆయన అనుచరులు రామకృష్ణనాయుడుతో తరచూ గొడవ పడుతూనే ఉండేవారు.
గత 10-15 రోజులుగా రామకృష్ణనాయుడు తన ట్రాక్టరుతో పొలంలోకి మట్టి తీసుకువెళుతున్నప్పుడు, వైసీపీకి చెందిన వెంకటరమణ మరికొందరు ఆయనని అడ్డుకుని దాడి చేశారు. ఆయన భార్య దేవమ్మ, కుమారుడు సురేష్, కోడలిపై కూడా వారు దాడి చేశారు.
Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…
అప్పుడే ఆయన మదనపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసి వైసీపీ కార్యకర్తల వలన తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని పిర్యాదు చేశారు. కానీ నిందితులు వైసీపీకి చెందినవారు కావడంతో పోలీసులు ‘భూవివాదం కేసు’గా ఇరువర్గాలపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
పోలీసులు అప్పుడే నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఉండి ఉంటే కాగితి రామకృష్ణనాయుడు ప్రాణాలు కోల్పోయేవారు కారు.
ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనపై నాలుగుసార్లు హత్యాయత్నం జరిగింది. అప్పుడు తప్పించుకోగలిగారు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే దారుణంగా హత్య చేయబడి ప్రాణాలు కోల్పోయారు.
వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు టీడీపీ కార్యకర్తలు భయం భయంగానే బ్రతికారు. ఇటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేదా? వైసీపీ గూండాలను చూసి ఇంకా భయం భయంగా బ్రతకాల్సిందేనా?అనిపిస్తుంది.