విజయవాడ నగరాన్ని, ప్రజలని వరదల నుంచి కాపాడటంలో టిడిపి కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారం చేస్తూనే ఉంది. తాజాగా ఇదే అంశంపై టిడిపి కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియాలో జగన్ 8 ప్రశ్నలు సంధించారు.
వాటిలో జగన్ ‘ఫ్లడ్ కుషన్’ అనే పదం కూడా వాడారు. ఫ్లడ్ కుషన్ అంటే వర్షాల కారణంగా ప్రాజెక్టులలో నీళ్ళు ఎక్కువగా చేరుతుంటే ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ నీటిని కొద్దిగా దిగువకు విడుదల చేస్తూ వరద ముంపుని నివారించడం.
Also Read – తప్పుకుంటున్నారా…తప్పిస్తున్నారా..?
భారీ వర్షాలు, వరదలు వస్తాయని టిడిపి కూటమి ప్రభుత్వానికి ముందే తెలిసి ఉన్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో నీటిని దిగువన గల రిజర్వాయర్లలో సర్దుబాటు చేసి ‘ఫ్లడ్ కుషన్’ చేయకపోవడం వలననే విజయవాడ నగరం ముంపుకి గురైందని జగన్ ఆరోపించారు.
ఐదేళ్ళు విజయవాడలోనే ఉండి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన జగన్‌కి కృష్ణానది ఎటువైపు ఉందో, బుడమేరు ఎటువైపు ఉందో కూడా తెలీదు. విజయవాడకి ఎందువల్ల వరదలు వచ్చాయో కూడా తెలీదు. అటువంటి వ్యక్తికి ఫ్లడ్ కుషన్’ గురించి తెలుసనుకోలేము. సాగునీటి నిపుణులు ఎవరో నాలుగు లైన్లు వ్రాసిస్తే దానినే జగన్ పేరిట సోషల్ మీడియాలో పెట్టుకొని ఉండవచ్చు.
Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్ డౌట్!
అయితే ఈ ప్రశ్నకు టిడిపి ఇచ్చిన సమాధానం జగన్ జీర్ణించుకోవడం కష్టమే. “ఇంతకీ తమరు ఈ ట్వీట్ బెంగుళూరులో ఉండి వేసారా? లండన్‌లో ఉండి వేసారా? బెంగుళూరులో ఉండే నీకు తెలియదు అనుకుంటా, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎప్పటి నుంచో తెరిచే ఉన్నాయి. ఫ్లడ్ కుషన్ మైంటైన్ చేస్తూనే ఉన్నారు. నీ మొఖానికి ‘ఫ్లడ్ కుషన్’ అంటే కూడా తెలిసే అవకాశం లేదులే,” అంటూ ప్రతీ ప్రశ్నకు టిడిపి ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష నేతలు వారికి ధైర్యం చెప్పాలి. యధాశక్తిన సాయం చేయాలి. గతంలో టిడిపి అదే చేసింది. కానీ వైసీపి దాని అధినేత జగన్ ఈ వరదల నుంచి కూడా రాజకీయ మైలేజ్ పొందాలని ఆరాటపడుతూ బురద రాజకీయాలు చేస్తున్నారు. అందుకే జగన్‌కి మనిషి లక్షణాలు లేవని, సంఘ బహిష్కరణ చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read – కిల్ బిల్ పాండ్య’..!
జగన్ ప్రశ్నలకు టిడిపి సూటిగా, ఘాటుగా సమాధానాలు ఇచ్చింది. టిడిపి మాటల్లోనే…
తమరు ఈ ట్వీట్ బెంగుళూరులో ఉండి వేసారా ? లండన్ లో ఉండి వేసారా ?
గత ఏడు రోజులుగా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న నీ రోత రాజకీయానికి సమాధానాలు..ముందుగా.. తమరు ఇస్తానన్న కోటి వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు ?
1. చంద్రబాబు గారి సమర్ధతతో, ఒక్కఈ ఒక్క రోజులో మూడు పూటలా కలిపి 8… https://t.co/1XU5s2qPWy
— Telugu Desam Party (@JaiTDP) September 7, 2024