
ఆ లక్షణాలు, విధానాలే టీడీపీకి శ్రీరామరక్ష!
దాదాపు నాలుగు దశాబ్ధాలుగా టీడీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడగలిగిందంటే దానికి రెండు బలమైన కారణాలున్నాయి. 1. బలమైన నాయకత్వం, 2. బలమైన క్యాడర్.
Also Read – తల్లిపై కేసు.. తల్లికి వందనంతో మరో కేసు!
అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడగల పరిచయాలున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన పద్దతినే పాటిస్తూ కార్యకర్తల కోసం చాలా చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
వైసీపీ అధికారంలో లేనప్పుడు జగన్ కూడా కార్యకర్తలనే నమ్ముకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక వారి స్థానంలో వేల కోట్లు జీతాలు ఇచ్చి కోటరీని, ఐప్యాక్, వాలంటీర్లను, సలహాదారులను, నియమించుకొని రాజకీయాలు చేశారు. అది తప్పని తెలుసుకునే సరికి సమయం మించిపోయింది. కనుక ఇప్పుడు మళ్ళీ నా కార్యకర్తలు.. అంటూ తియ్యతియ్యగా మాట్లాడుతున్నారు.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
ఏది ఏమైనప్పటికీ టీడీపీ, వైసీపీల జయాపజయాలలో కార్యకర్తలు కీలకమని స్పష్టమవుతోంది. విజయనగరం జిల్లా, చీపురుమల్లి నియోజక వర్గానికి చెందిన టీడీపీ యువ నాయకుడు కిమిడి నాగార్జున అక్కడ జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, “ఆనాడు మన తాతలు, నాన్నలు పార్టీ జెండా పట్టుకొని పనిచేశారు. వారి కృషి, వారి త్యాగాలు ఫలితమే మన పార్టీ.
2024 ఎన్నికలలో మన పార్టీ విజయానికి ప్రధాన కారణం యువతరమే. కనుక పార్టీలో కార్యకర్తల స్థాయి నుంచి పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నవారిని మనకి పోటీగా భావించవద్దు. వారిని వెన్ను తట్టి ప్రోత్సహించి రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు పార్టీలో నాయకులే తోడ్పడాలి. అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుంది.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఈ మాట ఓ నాయకుడుగా చెప్పడం లేదు. కార్యకర్తలలో ఒకడిగా అనుకొని చెపుతున్నాను. కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారు,” అని అన్నారు.
పార్టీలో అందరినీ కలుపుకు పోగలిగినవారే నాయకులవుతారు. అటువంటి గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు ఉంది. జిల్లా స్థాయి నాయకులలో కూడా అటువంటి లక్షణం అవసరమని కిమిడి నాగార్జున చెప్పిన మాట వాస్తవమే కదా?
క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. పార్టీ బలంగా ఉంటేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అప్పుడే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన తట్టుకొని అధికారంలోకి రాగలుగుతుంది. ఇందుకు టీడీపీ కంటే చక్కటి ఉదాహరణ ఏముంటుంది?