Bandi Sanjay Comments On Rahul Gandhi

దేశ ప్రధాని నరేంద్ర మోడీ కులం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలలో కాకరేపాయి. రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతూ మోడీ కులం గురించి చెప్పిన నువ్వు మీ అధినేత రాహుల్ కులం గురించి, మతం గురించి, జాతి గురించి చెప్పగలవా.? అంటూ ప్రశ్నించారు. అలాగే రాహుల్ కి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.

Also Read – రేవంత్ రెడ్డి…మరో జగన్ రెడ్డి కానున్నారా.?

రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ, తల్లి సోనియా గాంధీ..క్రిస్టియన్, తల్లి దేశం ఇటలీ, తండ్రి ఇండియన్…అంటూ రాహుల్ పుట్టుపూర్వత్రాలను తెరమీదకు తెచ్చారు బండి. దీనితో మోడీ అభిమానులు, బీజేపీ మద్దతుదారులు రాహుల్ ‘లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్’.? అంటూ రేవంత్ రెడ్డి పై విరుచుకుపడుతున్నారు.

ఇక మరో బీజేపీ సీనియర్ నేత ఈటెల వ్యాఖ్యానిస్తూ గతంలో మోడీ మీద సీఎం హోదాలో ఉంటూ ఇలా అవాకులు చవాకులు పేలిన కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రజల వద్ద తిరస్కరణకు గురై ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Also Read – అనుభవానికి…ఆవేశానికి మధ్య గీత ఇదేనా.?

ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరి సీఎం హోదాలో ఉంటూ ఇలా దేశ ప్రధాని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా కుల ప్రస్తావన తెస్తూ మోడీని విమర్శించడంతో రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందంటూ రేవంత్ కు శాపనార్ధాలు పెట్టారు. ఇలా రేవంత్ రెడ్డి ఇక వివాదానికి, తమ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడానికి మరో వివాదంలో ఇరుక్కున్నారు.

రాహుల్ ను ఉద్దేశించి బీజేపీ నేతలు అడిగే ప్రశ్నలకు రేవంత్ వర్గం కూడా అదే స్థాయిలో బీజేపీ పై కౌంటర్ ఎటాక్ చేయగలదా.? లేక ఆ వివాదానికి ముగింపు పలకడానికి మరో వివాదాన్ని తెరమీదకు తెస్తుందా.? రాజకీయ నాయకులు ఆడే ఈ కుల రాజకీయాలు నానాటికి తన పరిధిని పెంచుకుంటూ పోతున్నాయనే చెప్పాలి.

Also Read – వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?


ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితి చూస్తుంటే వివరణ తో పోయేదాన్ని రేవంత్ శృతిమించి వివాదం వరకు తెచ్చుకున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ నేతల నుంచి ఎదురయ్యే ఈ ప్రశ్నలు అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఇరుకున పెట్టనున్నాయి. మరి కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ పై ఎటాక్ కు సిద్ధమవుతోందా.? లేక రేవంత్ పై విమర్శల అక్షింతలు వేస్తుందా.?