ktr

ఏపీలో ఎవరిని ఓడించాలని ఆశ పడ్డారో..,ఎవరి గెలుపు కోసం ఆదుర్దా పడ్డారో ఆ రెండు కార్యక్రమాలు చేయలేక పోయిన బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు బాబు భజన చేస్తున్నారు. మొన్న బిఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలి రోజే సంతకం పెట్టి పూర్తి చేసారు.

ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన రోజే 3000 గా ఉన్న పెన్షన్ ను 4000 కు పెంచుతూ మాట నిలబెట్టుకున్నారు బాబు. మరి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు అంటూ బాబు నిబద్ధతను కొనియాడారు.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

అలాగే ఏప్రిల్, మే , జూన్ మూడు నెలలకు కూడా పెంచిన 1000 రూపాయలను అదనంగా అందిస్తూ జులై లో మనిషికి 7 వేలు పెన్షన్ అందించే కార్యక్రమానికి బాబు తొలి సంతకం చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. ఏపీలో సాధ్యమైన ఈ కార్యక్రమం తెలంగాణలో ఎందుకు అమలు చేయలేకపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రేవంత్ సర్కార్ పై ఆరోపణలు చేసారు.

ఇదిలా ఉండగానే ఈ రోజు కేటీఆర్ కూడా ఏపీ ప్రస్తావన తెస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. ఏపీలో 16 ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూ విశాఖ ఉక్కు ప్రవైటీకరణ కాకుండా ఆపగలిగింది. కానీ ఇక్కడ 16 ఎంపీ సీట్లతో సీఎం రేవంత్ రెడ్డి ఎం చేస్తారని ప్రశ్నించింది.

Also Read – కోడి కత్తి కేసు కూడా ఇలా బెడిసి కొట్టిందే!

తెలంగాణలో బొగ్గు గనుల వేలం ఆపాలంటూ గతంలో మోడీకి లేఖ రాసిన రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు కూడా ఇస్తున్నారు బిఆర్ఎస్ ముఖ్యనాయకులుగా ఉన్న హరీష్. కేటీఆర్.

అయితే గతంలో జగన్ గెలుపు కోసం తమవంతు సహాకారం అందించి వైసీపీ ప్రభుత్వానికి పరోక్ష సహకారం అందించిన బిఆర్ఎస్ నాయకులు ఇపుడు జగన్ ను కాదని బాబుకి మద్దతుగా నిలబడడం చూస్తుంటే బిఆర్ఎస్ నేతలకు ఇప్పటికైనా తత్త్వం బోధపడింది మరి జగన్ కు కూడా బాబు విలువ తెలిసే రోజు అతి తొందరలోనే ఉంటుందంటున్నారు టీడీపీ శ్రేణులు.

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాబుకు అనుకూలంగా ఎవ్వరైనా ఒక్క మాట మాట్లాడినా వారిపై మానసిక దాడి చేసే జగన్ బూతుల నేతలకు ఇప్పుడు తమ మిత్రపక్షమైన బిఆర్ఎస్ పార్టీ నేతలే బాబు నిబద్ధతను కొనియాడుతున్నా దాని పై స్పందించడానికి, హరీష్ రావు, కేటీఆర్ కు వైసీపీ బూతుల ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవ్వరు మీడియా ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కేటీఆర్, హరీష్ రావు బాబు గురించి మాట్లాడుతున్న మాటలు తాడేపల్లి ప్యాలస్ గేటు తాకలేదా.? లేక వైసీపీ నేతల చెవిన పడలేదా.? లేక వినపడినా వినపడనట్లు నటిస్తున్నారా.? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.