Venu Swamy

తానొక జోత్యిష్యుడనని, తానూ చెప్పిందే జాతకం, తానూ పలికిందే శాసనం అన్నట్టుగా గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల నుండి సినీ సెలబ్రేటిస్ వ్యక్తిగత జీవితాల వరకు అన్ని రంగాలలోతానే సిద్ధహస్తుడిగా భావించి నోటికి వచ్చిదల్లా మీడియాకెక్కి మరి వాగుతుంటారు వేణు.

నాగ చైతన్య, సమంత విడిపోతారని, ప్రభాస్ సినీ జీవితం ఇకచివరి దశకు వచ్చిందని, ఈసారి తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ జయకేతనం ఎగరవేసి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని, అలాగే ఏపీలో వైసీపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుని జగన్ తన హవా కొనసాగిస్తారని ఇలా ఈ స్వామి గారు ఇతరుల జీవితాన్ని ముందే ఉహించి కాలజ్ఞానం చెపుతుంటారు.

Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?

అయితే వీటిలో గుడ్డిలో మెల్లగా ఎదో ఒక విషయం జరిగితే ఇక నేను చెప్పిందే జరిగింది, నేనే బ్రహ్మ అన్నట్టుగా తెగ రెచ్చిపోతారు . ఈ వేణు విషయంలో కూడా చై..శ్యాం విడాకుల విషయం కార్యరూపం దాల్చడంతో ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో వేణు హావ మీడియాలో చాల గట్టిగానే సాగింది.

అయితే బిఆర్ఎస్, వైసీపీ అపజయాన్ని మాత్రం వేణు తన దివ్య శక్తులతో అడ్డుకోలేకపోయారు. దానితో కంగుతిన్న వేణు మళ్ళీ సినీ జీవితాల వైపు తొంగి చూసి నాగ చైతన్య ,శోభిత నిచితార్ద సందర్భంగా మరోసారి తన నోటి దూలను బయటపెట్టారు.

Also Read – వర్మ సినిమాలకు జగన్‌ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?

త్వరలోనే వీరి జంట కూడా విడిపోకతప్పదంటు ఇరు కుటుంబాల మనోభావాలను దెబ్బ తీసే వ్యాఖ్యలు చేసి కోరుండి కోర్ట్ చిక్కులు తెచ్చుకున్నారు వేణు. ఈ విషయమై ఈ నెల 14 న విచారణకు హాజరుకావాలంటూ రాష్ట్ర మహిళల కమిషన్ రెండో సారి వేణుకి నోటీసులు పంపించింది.

ఈ వివాదానికి సంబంధించి గతంలో కోర్ట్ నోటీసులు అందుకున్న వేణు విచారణకు హాజరు కాకుండా కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకుని తప్పించుకున్నారు. తాజాగా న్యాయస్థానం ఈ స్టే ని ఎత్తివేయడంతో మరోమారు మహిళా కమిషన్ సదరు నోటి దూల స్వామికి నోటీసులు పంపించింది.

Also Read – జగన్‌ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!

ఐపీల్ సిరీస్ లో కప్పు అందుకునే జట్టు ఎదో ముందే చెప్పగలిగిన ఈ స్వామి భవిష్యత్తులో తానూ కోర్ట్ నోటీసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉహించలేకపోవడం ఆశ్చర్యం. ఒకరి విజయాన్ని, మరొకరి జీవితాన్ని మీడియాకెక్కించగలిగిన ఈ మేధావి తన జీవితం గురించి మీడియాలో చర్చకొస్తుంది అనేది తెలుసుకోలేకపోయారు.




జోతిష్యం పేరుతో ఇతరుల జీవితాలలో తొంగి చూడడం, జాతకాల పేరుతో పక్క వారి భవిష్యత్ ను నిర్దారిస్తూ మీడియాలో చర్చలు జరపడం ముమ్మాటికీ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడమే అవుతుంది. ఇటువంటి వారి నోటి దూలను అదుపు చేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉంది.