
దర్శకుడు చందు మొండేటి, అక్కినేని నాగ చైతన్య కాంబోలో రాబోతున్న మూడవ సినిమా తండేల్ ఈ ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చై గత సినిమాలతో పోలిస్తే తండేల్ బడ్జెట్ భారీ స్థాయిలో ఉండడంతో ఈ మూవీ విజయం మీద ఎంతో ఆసక్తి నెలకొంది.
అయితే గతంలోను చందు, చై కాంబోలో 2016 న ప్రేమమ్, 2018 సవ్యసాచి రిలీజ్ అయ్యాయి. ఇందులో ప్రేమమ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడినప్పటికీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. దీనితో వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ ఫిలిం తండేల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఇటు ప్రేక్షకులతో పాటుగా ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా వ్యక్తమవుతోంది.
Also Read – హాజరు కోసమే కేసీఆర్ వచ్చారట!
అలాగే లవ్ స్టోరీ మూవీతో తొలిసారిగా జోడి కట్టిన నాగ చైతన్య, సాయిపల్లవి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తండేల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న వీరిద్దరూ తమ హిట్ కాంబో ను రిపీట్ చెయ్యాలని ఆశిస్తున్నారు.
ఇక నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, గీత ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చిన నాగ చైతన్య 100 % లవ్ మూవీ కూడా చైతన్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక సంగీత దర్శకుడు దేవి, నాగ చైతన్య కాంబోలో వస్తున్న రెండవ సినిమాగా తండేల్ ఇప్పటికే మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?
ఇలా తండేల్ మూవీ యూనిట్ మొత్తం కూడా డబల్, ట్రిపిల్ ధమాకా కాంబినేషన్స్ తో సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ ఫిబ్రవరి 7 న థియేటర్లలో సందడి చేయనున్న తండేల్ బాక్స్ ఆఫీస్ వేట కొనసాగించగలడా.? చిత్ర యూనిట్ అంటున్నట్టుగా ఈసారి వస్తున్నాం…దుళ్లగొడుతారా.?