
వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలందరికి హైద్రాబాద్ నగరం ఒక మహా అద్భుతమనే చెప్పాలి. బడా సూపర్ స్టార్స్ నుంచి చోట మోట టీవీ, యు ట్యూబ్ సెలబ్రెటీల వరకు హైదరాబాద్ కేంద్రంగానే తమ వృత్తి ని కొనసాగిస్తుంటారు.
అయితే నాడు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెండితెర సెలబ్రెటీలైన అనేకమంది స్టార్స్ ఈ డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుని కేసుల్లో ఇరుక్కున్నారు. అందులో మాస మహారాజ్ రవితేజ నుండి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి….ఇలా అందరికి సుపరిచితమైన స్టార్స్ సైతం డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొని మీడియాలో నిత్యం వార్తలలో నిలిచారు.
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
అయితే ఆ కేసులలో అసలు దోషులెవరో, నిర్దోషులెవరో, భాదితులెవరో కూడా ఇప్పటికి ప్రభుత్వాలు నిగ్గుతేల్చి వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోయింది. కానీ అప్పుడప్పుడు ప్రభుత్వాలు సెలబ్రెటీలకు తమ బలం చూపించడానికి, వారి బలహీతను గుర్తు చేయడానికి డ్రగ్స్ కేసు ను తెరమీదకు తెస్తూనే ఉంటారు.
అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్స్, బుల్లితెర సెలబ్రేటిస్ ద్వారా ప్రమోట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ పై ద్రుష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా సెలబ్రెటీల బ్యాంకు అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బు జమచేరుతుంది, అలాగే వారిని నమ్మి ఈ యాప్స్ ను వినియోగిస్తున్న వినియోగదారుల ఖాతాల నుండి భారీ మొత్తంలో నగదు ఖాళీ అవుతుంది.
Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
ఈ బెట్టింగ్ యాప్స్ వినియోగంలో ఎక్కువగా సమిధులవుతుంది ఈజీ మనీ కి అలవాటు పడినవారు, సంపాదన మీద సరైన అవగాహన లేని టీనేజర్స్, ఖర్చుకు తగ్గ ఆదాయం లేని అమాయకులే బాధితులు కావడం బాధకారం. తప్పని తెలిసినా సెలబ్రేటిస్ తమ ఆదాయం కోసం ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి సమాజంలో బెట్టింగ్ భూతాన్ని పెంచి పోషిస్తున్నారు.
అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఇన్నాళ్ళుగా చోట మోట సెలబ్రెటీల పేర్లు బయటకు వస్తున్నప్పటికీ తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు బడా సెలబ్రెటీల పేర్లు కూడా వినిపిస్తుండడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సెలబ్రెటీలు, యు ట్యూబ్ ఇన్ఫ్లుఇన్సర్లు సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటే ఇప్పుడు ఈ విచారణల పేరుతో కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
Also Read – నేను భారతీయురాలినే అంటున్న ప్రభాస్ హీరోయిన్.
ఇకనైనా ప్రతి ఒక్క సెలబ్రెటీ తమవంతు బాధ్యత గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిద్దాం. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న పాత్రదారులనే కాకుండా వీటి వెనుక ఉన్న అసలైన సూత్రదారుల పై కూడా కేసులు నమోదు చేసి ఈ బెట్టింగ్ భూతానికి శాశ్వతంగా స్వస్తి పలకాలి. లేకుంటే ఇది కూడా ఒక డ్రగ్స్ కేసు మాదిరి నాలుగు రోజుల మీడియాలో హడావుడి కి మాత్రమే పరిమితమవుతుంది.