Tollywood Heros Struggling For One Hit

గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలని, వెండితెర మీద తమను తాము హీరోగా చూసుకోవాలని ఉత్సుకత ఉన్న ఎంతో మంది ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ అడుగుపెడతారు. అయితే వారు ఆ ఒక్క ఛాన్స్ అందుకోవడమే మహద్బాగ్యం అన్నట్టుగా ఫీలవుతారు.

ఇక ఆ తరువాత వారి కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడయితే సినీ ఇండస్ట్రీలో వారి హవ ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ సినీ కష్టాలు ఎలా ఉంటాయో, ఆ తరువాత వారికొచ్చే క్రెజ్ ఎలా ఉంటుందో తన సినిమాలలో ఎక్కువగా చూపించే రవితేజ అప్పట్లో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ ఖడ్గం మూవీ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Also Read – మెట్రో దూకుడు మంచిదేనా?

కానీ ఇప్పుడు వరుస అపజయాలతో ఒక్క హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రాక్, ధమాకా వంటి వరుస విజయాల తరువాత రవితేజ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా ఫ్లాప్స్ తో నిండిపోయిందనే చెప్పాలి. టైగర్ నాగేశ్వరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్ వంటి వరుస అపజయాలతో రవితేజ ఇప్పుడు మాస్ జాతర మూవీ తో ‘ఒక్క హిట్ ప్లీజ్’ అంటున్నారు.

ఇక యంగ్ హీరో రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. 2019 లో వచ్చిన పూరీ ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత రామ్ కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఇక ఆ తరువాత బోయపాటి తో వచ్చిన స్కంద, రెడ్, ది వారియర్, డబల్ ఇస్మార్ట్ రామ్ అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న రాపో 22 తో రామ ఒక్క హిట్ ప్లీజ్ అనే పరిస్థితికొచ్చారు.

Also Read – అక్కడ కాళేశ్వరం.. ఇక్కడ పోలవరం సేమ్ టూ సేమ్?

తన కెరియర్ లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ నే ఎక్కువగా చూసిన మరో యంగ్ హీరో నితిన్, ఈయన కుడా వరుస ప్లాప్స్ తో ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. నితిన్ తాజా చిత్రం రాబిన్ హుడ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్లను కొల్లకొట్టలేకపోయింది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రంలో నితిన్ నటించబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. మరి ఆ ఎల్లమ్మ అయినా నితిన్ కెరీర్ ను గాడిన పెట్టి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

ఇక కార్తికేయ – 2 తో టాలీవుడ్ కూడా ఊహించని పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్. హ్యాపీ డేస్ మూవీతో హీరోగా అరంగేట్రం చేసిన నిఖిల్ మంచి సక్సెస్ కోసం చాల కాలమే ఎదురుచూసారు. అయితే ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తో మంచి హిట్ అందుకున్న నిఖిల్ కార్తికేయ చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్నారు.

Also Read – మోడీ మమ్మల్ని రెచ్చగొడుతున్నారు గానీ…

అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ – 2 పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ ను అందించినా ఆ తరువాత నిఖిల్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఇక ఇప్పుడు స్వయంభు మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు హీరో నిఖిల్. ఇక వెనుక మెగా, అక్కినేని అనే స్టార్ టాగ్స్ ఉన్నప్పటికీ ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్నారు ఈ బ్రాండ్ వారసులు.

అటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తొలిప్రేమ విజయం తరువాత ఆ స్థాయి సక్సెస్ ను చూడలేకపోయారు, ఇక f2 , f3 మూవీలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అందులో సీనియర్ హీరో వెంకటేష్ పాత్ర కూడా ఉండడంతో వరుణ్ తేజ్ సింగిల్ హీరోగా హిట్ కొట్టి చాలాఏళ్లే గడిచిపోయాయి.




ఇక అక్కినేని అఖిల్, సిసింద్రీ మూవీతో అతి చిన్న వయస్సులోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కుర్ర హీరో ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క అదిరిపోయే హిట్ కూడా లేకపోవడం అక్కినేని అభిమానులను వేధిస్తుంది. వీరందరూ కూడా ఇప్పుడు తమ కెరీర్ ను గాడిన పెట్టుకోవడానికి ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.