
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇద్దరూ ఒకరిని ఒకరు మిస్ అయ్యామని చెప్పుకున్నారు. ఒకరినొకరు మెచ్చుకున్నారు.
Also Read – అనుభవానికి…ఆవేశానికి మధ్య గీత ఇదేనా.?
మన బంధం చాలా బలమైనది… గొప్పదని ఏకాభిప్రాయనికి వచ్చారు. ఇరుదేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుందామని డిసైడ్ అయ్యారు. మీడియా సమావేశంలో కూడా ఇదే చెప్పారు.
అయితే ట్రంప్-మోడీ భేటీ, దాని వలన ఇరుదేశాల మద్య సంబంధాలు, లాభనష్టాల గురించి ఇప్పుడే ఏదో అనుకోవడం తొందరపాటే అవుతుంది.
Also Read – ఓటమి ఒప్పుకోవడం, బాధ్యత వహించడం చంద్రబాబుకే చెల్లు!
ట్రంప్ వలన భారత్‌కు, ఐటి కంపెనీలకు, భారతీయ ఎగుమతులకు, అమెరికాలో ఎన్ఆర్ఐలకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రధాని మోడీ ఆ నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించగలరు తప్ప అసలు నష్టం కలిగించకుండా ట్రంప్‌ని అడ్డుకోలేరు.
కనుక ట్రంప్ వంటి దుందుడుకు వ్యక్తితో కాస్త లౌక్యంగానే వ్యవహరించక తప్పదు. ప్రధాని మోడీ ఆవిదంగానే వ్యవహరించారని చెప్పొచ్చు.
Also Read – ప్రభుత్వాలకు ఆర్ధిక ఇబ్బందులు…ఎందుకీ పరిస్థితి.?
తొలి భేటీలో అన్నీ ట్రంప్ కోరుకున్నట్లే జరిగాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తిప్పి పంపడాన్ని ప్రధాని మోడీ సమర్ధించారు. స్వాగతించారు. ఈ విషయంలో ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కనుక మోడీ మాటలు ఆయనకి చాలా ఉపశమనం, సంతోషం కలిగిస్తాయి.
భారత్‌కి అత్యాధునిక ఎఫ్-31 యుద్ధ విమానాలు ఇచ్చేందుకు తాను అంగీకరించానని ట్రంప్ ప్రకటించారు. నిజానికి ఎఫ్-31 యుద్ధ విమానాలు ఇచ్చి ట్రంప్ భారత్‌కి మేలు చేయడం లేదు. వాటిని కొనేందుకు సిద్దపడి ప్రధాని మోడీయే ట్రంప్‌కి లక్షల కోట్ల డాలర్ల విలువగల బిజినెస్ ఇచ్చారు. భారత్ కోరుకుంటే ఫ్రాన్స్ మరిన్ని రాఫీల్ యుద్ధ విమానాలు అందించగలదు కదా?
ఇక అమెరికా నుంచి భారీగా చమురు కొనుగోలు ఒప్పందం కూడా చేసుకోబోతున్నామని ప్రధాని మోడీ చేసిన ప్రకటన కూడా ఇటువంటిదే.
ఉక్రెయిన్‌తో యుద్ధం, నాటో దేశాల ఆంక్షల కారణంగా రష్యా తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకుంది. కనుక భారీ రాయితీతో చమురు అమ్మకానికి సిద్దపడితే ప్రధాని మోడీ తెలివిగా ఆ అవకాశాన్ని వినియోగించుకొని తక్కువ ధరలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు.
కనుక భారత్‌కు అమెరికా చమురు అత్యవసరమేమీ కాదు. కానీ చమురు కొనుగోలు ద్వారా ప్రధాని మోడీయే అమెరికాకు భారీగా ఆదాయం సమకూర్చుతున్నారు. అయితే ఈ రెండు ఒప్పందాలు భారత్‌కు ఉపయోగపడేవే కానీ వాటితో నష్టం ఉండదు.
కానీ వీటితో ట్రంప్ ప్రసన్నం అయితే భారత్ ఎగుమతులు, ముఖ్యంగా ఐటి ఎగుమతులకు నష్టం తగ్గుతుంది. హెచ్1 బీ వీసాల విషయంలో ట్రంప్ కాస్త దూకుడు తగ్గించుకోవచ్చు. అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ట్రంప్-మోడీ భేటీ, ఈ ఒప్పందాలు ఎంతో కొంత తోడ్పడవచ్చు.
కనుక ఈ భేటీలో ట్రంప్ పైచేయి సాధించిన్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ట్రంప్ వలన భారత్‌కు 0.1 శాతం నష్టం తగ్గించగలిగినా ప్రధాని మోడీ పైచేయి సాధించిన్నట్లే భావించవచ్చు.