War Damage In Iran

ఇప్పుడు ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతూనే ఉంది. ఎక్కడో యుద్ధాలు మొదలైతే ఇక్కడ షేర్ మార్కెట్‌లో పడిపోతుంటుంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోతుంటాయి. కనుక ఎక్కడో ఏదో జరిగితే మాకేంటి? అని పట్టించుకోకుండా ఉండలేము.

ఇంతవరకు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మద్య యుద్ధం జరుగుతుండేది. మద్యలో అమెరికా కూడా జొరబడి ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడులు చేయడంతో యుద్ధం అమెరికాకు కూడా విస్తరించుకున్నట్లయింది.

Also Read – చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!

ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఇరాన్‌ మీద దాడి చేసినందున, రష్యా, చైనా, గల్ఫ్ దేశాలు ఇరాన్‌కి సాయం చేస్తాయి. కానీ అమెరికాతో నేరుగా యుద్ధం చేస్తే అవి కూడా తీవ్రంగా నష్టపోతాయి. కనుక అవన్నీ ఇరాన్‌కి పరోక్షంగా సాయపడటం ఖాయమనే భావించవచ్చు.

రష్యా-ఉక్రెయిన్‌ మద్య మూడున్నరేళ్ళుగా యుద్ధం జరుగుతుండటానికి ప్రధాన కారణం యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి ఆర్ధిక, ఆయుధ సాయం అందజేస్తుండటమే.

Also Read – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మూడు స్తంభాలాటేనా.?

అంటే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలాగే ఇజ్రాయెల్‌, అమెరికా-ఇరాన్‌ మద్య యుద్దం కూడా సుదీర్గంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ట్రంప్‌ దుందుడుకు నిర్ణయాలకు అటు అమెరికాతో పాటు యావత్ ప్రపంచదేశాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి.

Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?

ఇప్పుడు ఈ యుద్ధం సుదీర్గం సాగితే ముందుగా అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ నష్టపోయినా, ఒడిదుడుకులకు లోనైనా ఆ ప్రభావం ఆ దేశంతో వ్యాపార వాణిజ్య లావాదేవీలు జరుపుతున్న అన్ని దేశాలుపై పడుతుంది.

ముఖ్యంగా అమెరికాకు వివిద ఉత్పత్తులు, సేవలు ఎగుమతి చేస్తున్న సంస్థలపై కూడా పడుతుంది. అప్పుడు అమెరికాతో సహా యావత్ దేశాలలో ఉద్యోగాల కోతలు పెరిగి నిరుద్యోగ సమస్య పెరగవచ్చు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగవచ్చు. అవి పెరిగితే బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది.

కనుక ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం. కానీ ముగియకపోతే అమెరికాలో స్థిరపడిన భారతీయులతో సహా దేశంలో భారతీయులు అందరూ కూడా ద్రవ్యోల్బణం, ఆర్ధిక భారాలు భరించేందుకు ఇప్పటి నుంచే ముందస్తు ఆర్ధిక ప్రణాళికతో సిద్దంగా ఉండటం మంచిది.