
ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులన్నట్లు భారత్-పాక్‌లకు సుద్ధులు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టేశారు. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశారు.
రెండు రోజుల క్రితమే డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు ఖచ్చితంగా తెలుసని, ప్రస్తుతానికి ఆయనని చంపే ఉద్దేశ్యం తమకు లేదని కానీ చంపాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదన్నారు. కనుక బేషరతుగా లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
Also Read – వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ ఇంతేనా?
అందుకు ప్రతిగా అమెరికాపై దాడులు చేస్తామని ఖమేనీ హెచ్చరించడంతో అమెరికా బీ-2 స్పిరిట్ (స్టెల్త్) యుద్ధవిమానాలు ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశాయి.
దాదాపు వారం పది రోజులుగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఇరాన్‌ని లొంగదీసుకోలేకపోతోందని ట్రంప్ భావించినందునే ఇరాన్‌పై ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Also Read – జగన్‌వి శవరాజకీయాలట .. ఎంత మాటనేశారు నారాయణా?
ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయయడంతో ప్రస్తుతానికి దాడులు ముగిశాయని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికైనా అణు ఒప్పందంపై ఇరాన్ సంతకాలు చేయాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై ఎదురుదాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఫోన్ కాల్ లేదా మెసేజ్ వచ్చినా రాకపోయినా ఓసారి తెరిచి చూస్తుండటం ఎంత సహజమో, చేతిలో కత్తి, తుపాకీ వంటివి ఉన్నప్పుడు కూడా ఏదో ఓ సమయంలో వాటిని ప్రయోగించడం తధ్యం.
Also Read – రేవంత్ తన మార్క్ చూపించబోతున్నారా.?
అమెరికా అత్యంత సంపన్నమైన దేశం. దాని వద్ద అత్యాధునిక యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ఆయుధాలు ఉన్నాయి. కనుక ఏదో ఓ కారణంతో ఏదో ఓ దేశంతో యుద్ధం చేయడం పరిపాటిగా మారింది. రష్యా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇప్పుడు ఇరాన్, రేపు మరో దేశంతో అమెరికా యుద్ధాలు చేస్తూనే ఉంటుంది.
అమెరికాలో తుపాకీ సంస్కృతి ఇందుకు ఓ చిన్న ఉదాహరణ అనుకుంటే, ఇరాన్‌తో యుద్ధం ఓ పెద్ద ఉదాహరణ అనుకోవచ్చు.