jagan-tadepalli-house Vaastu Problems

వైసీపీ జగన్‌ 5 ఏళ్ళపాటు బటన్ నొక్కి సంక్షేమ పధకాల పేరుతో లక్షలు కోట్లు పంచారు. కానీ అక్క చెల్లెమ్మలు ఎందుకు ఓట్లు వేయలేదో?అని బాధ పడ్డారు. కానీ 40 శాతం మంది మనవైపే ఉన్నారని సర్ధి చెప్పుకున్నారు.

మరైతే మన ఓటమికి ఎవరు కారణం అంటే ఈవీఎంలని జగన్‌ తేల్చి చెప్పేశారు. మోడీ, చంద్రబాబు, పవన్ ముగ్గురూ కలిసి ఈవీఎంలను మ్యానిప్యులేట్ చేసి గెలిచారని జగన్‌ కనిపెట్టి చెప్పారు.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

కనుక మళ్ళీ వారు ఆవిదంగా తనని మోసం చేయకూడదంటే దేశంలో మళ్ళీ బ్యాలెట్ ఓటింగ్ తీసుకురావాలని జగన్‌ కొత్త పల్లవి అందుకున్నారు.

కానీ ఇన్నేళ్లుగా రాజకీయాలలో నలిగిన జగన్‌కి తమ ఓటమికి తానే అసలు కారణామని తెలియకనే ఈవీఎంలు, చంద్రబాబు నాయుడు అంటున్నారా? అంటే కాదనే చెప్పొచ్చు. కానీ హుందాగా ఓటమి ఒప్పుకోని నైతిక బాధ్యత వహించడానికి అహం అడొస్తోంది. కనుక ఆ నింద తనపై వేసుకొని ప్రజలలో మరింత చులకన అవడం కంటే ఈవీఎంలని, చంద్రబాబు నాయుడుపైకి తోసేసి ఆ వాదనతో నిసిగ్గుగా ప్రజల మద్య తిరిగేయవచ్చని భావిస్తున్నారేమో?

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

ఏది ఏమైనప్పటికీ ‘వైసీపీ ఓటమికి నేను కాదు ఈవీఎంలని’ జగన్‌ ప్రకటించేశారు కనుక కనీసం ఆ వాదనకు కట్టుబడి ఉన్నా బాగుండేది. కానీ తాడేపల్లి ప్యాలస్‌లో కొన్ని వాస్తు దోషాలున్నాయని ఎవరో సూచించడంతో హడావుడిగా మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లు సమాచారం.

ముందుగా ఈశాన్యంవైపు ఎత్తుగా నిర్మించిన ఇనుప బ్యారికేడ్లు తొలగింపజేస్తున్నారు. గాలి, వెలుతురు కోసమే అని సిబ్బంది చెపుతున్నారట! అంటే గాలి, వెలుతురు లేకుండానే జగన్‌ 5 ఏళ్ళపాటు ఆ చీకటి కొంపలో బ్రతికారనుకోవాలా?

Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!

కేసీఆర్‌ ఎన్నో యజ్ఞయాగాలు చేశారు. వాస్తు దోషాలు లేకుండా ‘వైట్ హౌస్’ వంటి సచివాలయం కట్టించుకున్నారు. కానీ దానిలో అడుగుపెట్టిన ఆరు నెలలలోనే ఎన్నికలలో ఓడిపోయారు. మరి అటువంటప్పుడు క్రీస్టియన్ మతాన్ని ఆచరిస్తున్న జగన్‌కు ఈ వాస్తు కరెక్షన్స్ ఫలిస్తాయా?డౌటే.

కేసీఆర్‌, జగన్‌ ఓడిపోతే గెలిచిన రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నారు. కానీ గమ్మత్తైన విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరికీ పెద్దగా వాస్తు పట్టింపులు లేవు. లేకపోయినా స్వయంకృషితో తాము గెలిచి తమ పార్టీలను గెలిపించుకున్నారు.




కనుక వారి నుంచి కేసీఆర్‌, జగన్‌ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వాస్తు కరెక్షన్స్ కాదు ఇద్దరూ సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుంటే మంచిదని!