
ప్రజలందరికీ వైసీపీ నేతల అవినీతి భాగోతాలు తెలిసి ఉండకపోవచ్చు. కానీ గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టినప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్‌లో ఆ వీడియో క్లిప్పింగ్స్, వార్తలు వచ్చాయి.. వాటిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు.
వంశీ గొప్పదనం గురించి ఆయన భార్య పంకజశ్రీ కంటే ఎవరికి బాగా తెలుసు? కానీ తన భర్తని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదని ఆమె అనడం విడ్డూరంగానే ఉంటుంది.
Also Read – విజయసాయీ ఏమిటీ నస?
ఈ కేసులో ఏదో రాజకీయకుట్ర ఉందని, న్యాయపోరాటం చేస్తానని ఆమె అన్నారు. అంటే ఆమె కూడా వైసీపీ కోణంలో నుంచే విమర్శిస్తున్నారన్న మాట!
పార్టీకి, దాని ధోరణికి కట్టుబడి ఉండటం మంచిదే. కానీ తన భర్తని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు?
Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!
పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతానని పదేపదే చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన తన భర్త వల్లభనేని వంశీకి, తమ కుటుంబానికి అండగా ఎందుకు నిలబడటం లేదు?అని ఆమె ఆలోచిస్తే బాగుంటుంది.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టిస్తుంటే, వారిని అరెస్టు చేయిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే పార్టీ సీనియర్ నేతలను, న్యాయవాదులను పంపించి సాయపడుతుండేవారు.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
ఆనాడు చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి న్యాయవాదులను పంపించడం వల్లనే తాను ప్రాణాలతో బయటపడ్డానని పోలీసుల చేతిలో చిత్రవధ అనుభవించిన వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్వయంగా మీడియాతో చెప్పారు.
పార్టీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలను ఏవిదంగా కాపాడుకోవాలో కూడా చంద్రబాబు నాయుడు నిరూపించి చూపారు. కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు?అంటే పార్టీ నేతలతో, సొంత మీడియాతో సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పింపజేస్తున్నారు.
తద్వారా వైసీపీకి కాస్త సానుభూతి, రాజకీయ మైలేజ్ లభించాలని ఆశిస్తున్నారే తప్ప వల్లభనేని వంశీకి, ఆయన కుటుంబానికి అండగా నిలబడలేదు.
ఇటువంటి అధినేత కళ్ళలో ఆనందం చూడటం కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చెలరేగిపోతే ఏమవుతుంది? చివరికి ఇలాగే జరుగుతుందని ప్రతీ ఒక్కరూ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.