
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పటికే ఆరు కేసులలో అరెస్టయ్యి జైల్లో బైలు కోసం అల్లాడుతున్న వైసీపీ నేత వల్లభనేని వంశీ పై ఇప్పుడు మరోకేసు నమోదయ్యింది. దీనితో ఈసారైనా తనకు పాత కేసుల నుండి బైలు ద్వారా విముక్తి వస్తుంది, బయటకొద్దాం అని ఆశగా ఎదురుచూస్తున్న వంశీ నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది.
బావులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్ట్ లో వంశీ పై పోలీసులు పీటీ వారెంట్ ఇష్యూ చేసారు. దీనితో ఇప్పటికే ఆయన మీద నమోదైన ఆరు కేసులలో ఐదు కేసులలో వంశీకి బైలు మంజూరయ్యింది.
Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!
ఇక టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో మాత్రమే వంశీ బైలు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ కేసులో కూడా వంశీ బెయిల్ అభ్యర్ధన పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బైలు ఇచ్చే అంశం మీద తుది తీర్పు రేపు వెలువడించనుంది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 న హైద్రాబాద్ లో అరెస్టయిన వంశీ బైలు మీద బయటకు రాబోతున్నారు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్న ఇటువంటి సమయంలో ఆయన మీద ఇప్పుడు పోలీస్ అధికారులు పీటీ వారెంట్ ఇష్యూ చెయ్యడంతో వంశీ ఆ కేసులో బైలు సంపాధించినప్పటికీ ఈ కేసులో అరెస్టు కావచ్చు అంటూ వంశీ బైలు మీద చర్చ ఊపందుకుంది.
Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్ గారు?
ఇప్పటికే వంశీ ఆరోగ్యం క్షిణించింది, శ్వాస కోస ఇబ్బందులతో వంశీ జైల్లో ఇబ్బందిపడుతున్నారు అంటూ వంశీ తరుపున వాదిస్తున్న న్యాయవాదులు వంశీకి బైలు ఇవ్వాలంటూ న్యాయమూర్తులను అభ్యర్దిస్తున్నారు.
ఈ తరుణంలో వంశీ బావులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయ్యి లోపలి వెళ్తారా.? లేక టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బైలు పొంది బయటకు వస్తారా అన్న ఆసక్తి అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణులలో వ్యక్తమవుతోంది.