venu-swmay

ఏపీ లిక్కర్ స్కాం కేసు తీగ లాగితే వైసీపీ డొంక మొత్తం కదులుతున్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. రోజురోజుకి ఈ లిక్కర్ స్కాం నిందితుల సంఖ్య పెరుగుతూ పోతుంది, అలాగే రాష్ట్రంలో ఇంతవరకు వినపడని కొన్ని కొత్త పేర్లు, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలముందు రాని కొంతమంది వ్యక్తులు ఈ కేసుతో తెరమీదకొచ్చారు.

మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విచారణ తో మొదలైన ఈ కేసు కసిరెడ్డి అరెస్టుతో వేగం పుంజుకుంది. కసిరెడ్డి అరెస్టు తరువాత లిక్కర్ కేసులో వరుస అరెస్టుల పర్వం నడుస్తూ వస్తుంది. ఇందులోకి భాగంగా ఇప్పటికే చాణిక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, భారతి సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు కాగా తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా భావించే ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టు లు కూడా జరిగిపోయాయి.

Also Read – షర్మిల ఫోన్‌ కేసీఆర్‌ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?

దీనితో అతి త్వరలో ఈ స్కాం వెనుక ఉన్న అసలు సూత్రధారి కూడా అరెస్టు కాబోతున్నారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఆ అసలు సూత్రధారి మరెవరో కాదు వైసీపీ అధినేత వైస్ జగనే అంటూ, మరోసారి జగన్ తన అవినీతికి, అత్యాశకు మూల్యం చెల్లించబోతున్నారంటూ కూటమి శ్రేణులు వైసీపీ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

అయితే సినీ సెలబ్రెటీల జీవితాల నుంచి, రాజకీయ నాయకుల పదవుల వరకు, ఐపీఎల్ కప్పు నుంచి ఇండో పాక్ యుద్ధం వరకు ఏ విషయాన్నీ అయినా తన దివ్య దృష్టితో ముందే కనిపెట్టగలిన వేణు స్వామి ఈ జగన్ అరెస్టు గురించి కూడా ఏమైనా ముందస్తు సమాచారం ఇస్తారేమో వైసీపీ నేతలు తెలుసుకుంటే మంచిదంటూ వైసీపీ కి ఉచిత సలహాలు వస్తున్నాయి.

Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్‌ పట్టించుకోవట్లేదే!

2024 ఎన్నికలలో ఏపీలో ఎట్టి పరిస్థితులలో వైసీపీ నే అధికారంలోకి వస్తుంది, తిరిగి వైస్ జగన్ మోహన్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు అంటూ ప్రగల్భాలు పలికిన వేణు, అటు తెలంగాణలో కూడా ఈసారి బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతోంది, కానీ ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం జరుగుతుంది అంటూ తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు.

అలాగే గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైద్రాబాద్ సీజన్ విన్నర్ గా నిలుస్తుందంటూ పిట్టకథలు చెప్పారు. ఇక తాజాగా భారత్ – పాక్ మధ్య కొనసాగిన యుద్ధం మీద కూడా స్పందిస్తూ తానూ ఈ విషయాన్ని ఆరు నెలల ముందే చెప్పానంటూ ట్రంప్ మాదిరి ప్రకటనలు చేసారు.

Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?

ఇక ఇటు సినీ సెలబ్రెటీల విషయానికొస్తే అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మొదలుకుని ప్రభాస్ సినీ కెరీర్ వరకు ఈయన గారే ఆయా సెలబ్రెటీల జాతకచక్రాలు రాస్తూ మీడియాలో పిచ్చి ప్రేలాపనలు పేలుతూ పలుమార్లు చివాట్లు తిన్నారు, అనేకసార్లు భంగపాట్లు ఎదుర్కొన్నారు.




ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులంతా తమ ఆధ్యాత్మిక గురువైన వేణు స్వామిని ఆశ్రయించి అసలు ఏపీలో మొదలైన ఈ లిక్కర్ స్కాం కేసులో అరెస్టుల పర్వం ఇక్కడితో ఆగుతుంది, ఈ లిస్టులో వైస్ జగన్ పేరు ఉంటుందా.? ఒక వేళ ఉంటే ఆయన నెంబర్ ఎంత.? ఆయన అరెస్టు తేదీ ఏమిటి.? అనే విషయాలను ముందే తెలుసుకుని మీడియాలో ప్రకటిస్తే, ఇక వేళ అవి నిజమైతే ఇప్పుడు పాతాళానికి పడిపోయిన వేణు క్రెడిబిలిటీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. మరి వేణు స్వామి ఇందుకు సిద్ధమా.?