వైసీపీలో బాలినేని వివాదానికి ఓ ముగింపు లేకుండా పోతుంది. ఎన్నికల ప్రచారానికి 4 నెలలు ముందు మొదలైన ఈ వివాదం ఎన్నికల ఫలితాలు వచ్చిన 4 నెలలకు కూడా ఒక దారి తెన్నూ లేకుండా సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంది.
Also Read – విశాఖ అభివృద్ధిలో మరో అడుగు టీసీఎస్!
బాలినేని వైసీపీ ని వీడనున్నారా.? త్వరలో బాలినేని వైసీపీ కి గుడ్ బై చెప్పనున్నారు.! బాలినేని జనసేన జెండా పట్టుకోనున్నారా.? కూటమిలో బాలినేని అవకాశం దక్కనుందా.? అంటూ ఇలా ఎన్నో ప్రశ్నతో కూడిన హెడ్ లైన్స్ ఎన్నికల ముందు అటు మెయిన్ స్టీమ్ మీడియా లోను, ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసాయి.
అలాగే బాలినేని బుజ్జగించిన జగన్, బాలినేనితో మధ్యవర్తిత్వం వహిస్తున్న వైసీపీ ముఖ్య నేతలు, జగన్ హామీ తో బాలినేని సంతృప్తి చెందినట్టేనా.? ఇలా వైసీపీలోనే బాలినేని కొనసాగుతున్నారు అనేలా మరికొన్ని కథనాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?
అయితే తాజాగా బాలినేని తో రాజీ ప్రయత్నాలకు జగన్, మాజీ మంత్రి విడుదల రజనికి రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. అయితే ఇది జగన్ బాలినేని అవమానించినట్లే అంటున్నారు బాలినేని క్యాడర్. బాలినేని తో రజని రాజీ చర్చలు అంటే అది జరిగే పనేనా అనేది వైసీపీ నేతలను సైతం వేధిస్తున్న ప్రశ్న.
ఏంతో రాజకీయ అనుభవం ఉండి, వైస్ రాజశేఖర్ రెడ్డితో దీర్ఘకాలిక సంబంధాలు ఉండి, జగన్ కు కష్ట కాలంగా అండగా నిలబడి, వైసీపీ ని కాపు కాసిన ఇటువంటి వ్యక్తి దగ్గరకు తన స్థాయికి ఏమాత్రం సరిపడని రజని ని జగన్ రాయబారానికి పంపుతారా అంటూ బాలినేని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Also Read – తప్పుకుంటున్నారా…తప్పిస్తున్నారా..?
నిన్న కాకా మొన్న టీడీపీ పార్టీ నుండి వచ్చిన విడుదల రజని వంటి నేతలకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టి, వైస్ కుటుంబాన్ని, వైసీపీ పార్టీనే నమ్ముకున్న బాలినేని వంటి పార్టీ కోసం పని చేసే నాయకులను పక్కన పెట్టి అప్పుడే జగన్ వారిని ఒక రకంగా అవమానాల పాలు చేసారు.
ఇప్పుడు కనీసం బాలినేని ఆవేదనను అర్ధం చేసుకోవడానికి, ఆయనతో సంధి చర్చలు జరపడానికి వైసీపీ పార్టీలో బొత్స, అవంతి, అంబటి, విజయ సాయి, పెద్ది రెడ్డి, సజ్జల వంటి సీనియర్ నాయకులను లేదా పార్టీ ముఖ్య నేతలను పంపకుండా రజని వంటి జూనియర్ ని పంపడం వెనుక జగన్ ఉద్దేశం ఏమిటి అంటూ ఒంగోలు వైసీపీ కార్యకర్తలు సైతం జగన్ చర్య మీద గుర్రుగా ఉన్నారు.
ఇటు బాలినేని వివాదం ముగియక ముందే వైసీపీ కి సామినేని ఉదయభాను రూపంలో మరో గండం పొంచి ఉంది. ఉదయభాను కూడా త్వరలో వైసీపీ ని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి సామినేని ఇంటికి రాయబారం చేయబోతున్న ఆ నేత ఎవరు.?