Vijay Sai Reddy Meet With Amit Shah

ఇక్కడ టిడిపిలో అందరూ రాష్ట్రాభివృద్ధి, వైసీపిపై ప్రతీకారం తీర్చుకోవడం ఎలా?అని ఆలోచిస్తుంటే అక్కడ ఢిల్లీలో వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నిశబ్ధంగా పావులు కదుపుతున్నారు.

Also Read – చెప్పాల్సింది చెప్పేసి తూచ్ అంటే ఎలా బ్రహ్మాజీ?

ఇప్పుడు ఎన్డీయేలో టిడిపి కూడా భాగస్వామిగా ఉందని, మోడీ ప్రభుత్వ మనుగడలో చంద్రబాబు నాయుడుది చాలా కీలకపాత్ర అని తెలిసి ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి తన ప్రయత్నాలు మానుకోలేదు. పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారంటే ఢిల్లీలో ఆయన చేతులు ముడుచుకొని కూర్చోలేదని అర్దమవుతోంది.

ఇదివరకు రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి కలిస్తే నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలు… అంటూ కాకమ్మ కధలు చెప్పుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు వైసీపి అధికారంలో లేదు.

Also Read – వరద కష్టాలతో ప్రభుత్వానికి కొత్త పాఠాలు… నేర్చుకోవలసిందే!

కనుక విజయసాయి రెడ్డి పనిగట్టుకొని అమిత్ షాని పదేపదే ఎందుకు కలుస్తున్నారు?ఆయన చంద్రబాబు నాయుడుని, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తమ రాజకీయ ప్రత్యర్ధి అని తెలిసి ఉన్నా ఆయన కోరిన వెంటనే అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు?అనే ప్రశ్నకు వారిరువురే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

విజయసాయి రెడ్డి అమిత్ షాని రహస్యంగా కలుస్తున్నారని అనుకోవడానికి కూడా లేదు. విజయసాయి రెడ్డి ఎప్పుడు అమిత్ షాని కలిసినా మరిచిపోకుండా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?

తద్వారా ‘మా జోలికి రావద్దు… రాలేరని’ ఆయన టిడిపికి, సిఎం చంద్రబాబు నాయుడుకి ఏమైనా సందేశం పంపిస్తున్నారా?అనే సందేహం కలుగుతోంది.

గత 5 ఏళ్ళుగా జగన్‌ ఏపీలో రాక్షస పాలన చేస్తున్నా, ఎడాపెడా అప్పులు చేస్తున్నా మోడీ, అమిత్ షాలు పట్టించుకోలేదు.

ఆ తప్పులన్నిటినీ సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు సరిచేస్తుంటే, ఆయనకు అన్నివిధాలా సహకరిస్తామని చెపుతూనే మరో పక్క విజయసాయి రెడ్డితో ఈవిదంగా టచ్‌లో ఉండటం, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిబద్దతపై అనుమానం కలుగజేస్తుంది కదా?




ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో విజయసాయి రెడ్డి పావులు కదుపుతున్నారనే విషయం సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.