శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసీపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, తెలంగాణలో కేసీఆర్‌లాగే వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. తెలంగాణలో నన్ను కొట్టే మొగాడే లేడని విర్రవీగిన కేసీఆర్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు.
Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!
మొదట్లో ఆత్మవిమర్శ చేసుకొని, తమ పార్టీ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయిందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమ అహంకారం వలననే ఓడిపోయామని ఒప్పుకోలేక కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని చెప్పుకున్నారు. ఒకవేళ తమ ఓటమికి తమ అహంకారమే అని బిఆర్ఎస్ అధిష్టానం అంగీకరించకపోయినా గ్రహించి ఉంటే, ప్రజలు ఎన్నుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రగల్భాలు పలికేవారే కారు.
కానీ మళ్ళీ అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గురించి కేసీఆర్ అనవసరమైన మాటలు చాలా మాట్లాడారు. కనుకనే లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించి మూల కూర్చోబెట్టారు.
Also Read – రేషన్ బియ్యం పట్టుబడితే ఎదురు దాడి.. భలే ఉందే!
అయినా బిఆర్ఎస్ పార్టీ తన తప్పులను గ్రహించడం లేదు. ఆ పార్టీ నేతల నోటి దురుసుతనం తగ్గించుకోవడంలేదు. కనుక మరోసారి మరోవిదంగా మూల్యం చెల్లించక తప్పదు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని చూసి జగన్ తన 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసుకున్నారు. కానీ కేసీఆర్ అహంకారం, నోటి దురుసుతనం వల్లనే వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయారని గ్రహించలేకపోయారు. అందుకే జగన్, విజయసాయి రెడ్డి, అనిల్ కుమార్ వంటివారు అహంభావం ప్రదర్శిస్తున్నారు.
Also Read – రేషన్ బియ్యం దొంగలు గప్‌చిప్?
ఎవరో తమని మోసం అన్యాయం చేయడంవలననే ఓడిపోయామని జగన్ చెప్పుకోగా, “రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వాలంటే వైసీపి మద్దతు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ గ్రహించాలని” విజయసాయి రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు చేతులు కలపని పార్టీ లేదంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.
నిజానికి వైసీపి నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టే సమయం కాదిప్పుడు. తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని తమ ఓటమికి కారణాలు తెలుసుకుని ఆ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుండాలి.
కానీ కేసీఆర్‌లాగా అహంకారం, నోటి దురుసుతనం ప్రదర్శిస్తున్నారు. తద్వారా టిడిపి నేతలను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఏవిదంగా మునిగిపోబోతోందో, ఇక్కడ వైసీపికి కూడా అదేవిదంగా మునిగిపోక మానదు.