Vijayasai Reddy

వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతుంటారు. అయితే ఆ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలంటూ కేంద్ర ఐ‌టి మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కి ట్విట్టర్‌ ద్వారానే విజ్ఞప్తి చేశారు.

“ఆస్ట్రేలియాలో 16 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేదం విధించింది. భారత్‌లో కూడా అటువంటి ఆంక్షలు అవసరం. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కాంటెంట్స్ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. సోషల్ మీడియా వ్యసనానికి అలవాటు పడిన పిల్లలు కుటుంబంలో బంధాలకు దూరమవుతున్నారు. కనుక భారత్‌లో కూడా అత్యవసరంగా ఈ ఆంక్ష విధించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్‌ చేశారు.

Also Read – రేషన్ బియ్యం పట్టుబడితే ఎదురు దాడి.. భలే ఉందే!

నిజానికి సోషల్ మీడియాలో వైసీపి ప్రవేశించినప్పటి నుంచి చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ దాంతో చాలా బాధపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వైసీపి పోస్ట్ చేస్తున్న జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు, ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోలతో సమాజంలో అలజడి నెలకొంది.

వైసీపి శ్రుతిమించడంతో సోషల్ మీడియాలో దానిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సివస్తోందని విజయసాయి రెడ్డికి కూడా తెలుసు.

Also Read – నాడు – నేడు ప్రజా నాయకుడేనా….

తమ సోషల్ మీడియాలో ఇటువంటి అనుచిత కంటెంట్ ప్రచురిస్తూ, 16 ఏళ్ళలోపు పిల్లలు చెడిపోకుండా ఆంక్షలు విధించాలని కోరడం, దీనికీ… సోషల్ మీడియా ద్వారానే కేంద్రమంత్రికి మెసేజ్ పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది.

నిజానికి సోషల్ మీడియాలో నుంచి వైసీపిని, దాని వారియర్స్‌నే బ్యాన్ చేయాలని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి.

Also Read – అమరావతి రాజధాని… మద్యలో మన చంద్రుడు

వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న విమర్శలు కాస్త పద్దతిగా ఉంటున్నాయి. అలాగే సిఎం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఫోటోలు కూడా కాస్త పద్దతిగా ఉంటున్నాయి. కానీ బాటిల్ పైకి కొత్తగా కనిపిస్తున్నా లోపల సారా పాతదే!

చివరిగా విజయసాయి రెడ్డి గురించి ఓ ముక్క చెప్పుకోక తప్పదు. ఇలా ఏదో వంకతో ఆయన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులని ‘టచ్ చేస్తూ’ వారు తనని మరిచిపోకుండా గుర్తుచేస్తూనే ఉంటారు. ఈ టెక్నిక్ తెలియకనే రాజకీయాలలో రాణించిన చాలా మంది పెద్దగా గుర్తింపు లేకుండా మిగిలిపోతుంటారు.