Vijayasai Reddy

వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి రెండు రోజుల క్రితమే “మంత్రి నారా లోకేష్‌ సిఎం చంద్రబాబు నాయుడుని కుర్చీలో కూర్చోబెట్టి ప్రభుత్వంలో అంతా తానే అన్నట్లు పెత్తనం చేస్తున్నారని, తానే ముఖ్యమంత్రిని అన్నట్లు వ్యవహరిస్తున్నారని” ట్వీట్‌ చేశారు.

కానీ ఇవాళ్ళ మరో ట్వీట్‌లో “చంద్రబాబుకి పాలన చేతకాక చేతులెత్తేశాడు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడు. ప్రజల పక్షాన్న ప్రశ్నిస్తున్న వారిపై లోకేష్‌తో కలిసి వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నాడు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ, ఎన్నికల హామీలు అమలుచేయలేక 40 ఈయర్స్ ఇండస్ట్రీ చేతులెత్తేశాడు,” అంటూ ఘాటుగా విమర్శించారు.

Also Read – కేసీఆర్‌, కేటీఆర్‌ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?

గత 5 ఏళ్ళ జగన్‌ పాలనలో చంద్రబాబు నాయుడు, అచ్చన్నాయుడు, రఘురామ కృష్ణరాజుతో సహా ఎంత మందిని ఎంతగా వేధించారో విజయసాయి రెడ్డికే బాగా తెలుసు.

వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురైతే హడావిడిగా బ్యాండేజీలు చుట్టించి గుండెపోటు అని చెపుతున్నప్పుడు విజయసాయి రెడ్డికి నేరంగా అనిపించలేదు.

Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!

వైసీపి ఎమ్మెల్సీ అనంతాబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్‌ చేస్తున్నది పాలనే అనుకున్నారు తప్ప వ్యవస్థీకృత నేరమని విజయసాయి రెడ్డికి అనిపించలేదు.

జగన్‌ పాలనలో ఉద్యోగసంఘాల నేతలను వేధించడం, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా రోడ్డుపై నిలబెట్టారు. అది ప్రభుత్వానికి అవమానకరం, అప్రదిష్టగా భావించలేదు. అప్పుడూ విజయసాయి రెడ్డి నోరెత్తి జగన్‌ని ప్రశ్నించలేకపోయారు.

Also Read – అమరావతి రాజధాని… మద్యలో మన చంద్రుడు

జగన్‌ రాజధానిని, అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు తెస్తున్నప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలను, చివరికి పార్కులను తాకట్టు పెట్టేసి ఋషికొండపై 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలస్‌ నిర్మించుకున్నప్పుడు విజయసాయి రెడ్డికి తప్పుగా అనిపించలేదు.

జగన్‌ సోషల్ మీడియా వారియర్స్, వాలంటీర్లతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు విజయసాయి రెడ్డికి తప్పుగా అనిపించలేదు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిన పెట్టి, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించి, అమరావతి, పోలవరం పనులు మొదలుపెట్టిస్తుంటే విజయసాయి రెడ్డికి కనిపించడం లేదు!

అయినా గత మూడు నెలల్లో సిఎం చంద్రబాబు నాయుడు ఏనాడూ తనతట తానుగా వైసీపి సోషల్ మీడియా జోలికి పోలేదు. కానీ ఇప్పుడే ఎందుకు కేసులు మొదలయ్యాయి?అంటే విజయసాయి రెడ్డికే బాగా తెలుసు.

జగన్‌ పాలన గాడి తప్పిన ఏపీని చంద్రబాబు నాయుడు మళ్ళీ గాడిన పెట్టుకోగలుగుతున్నారు. కానీ గాడి తప్పిన వైసీపిని జగన్‌ గాడిన పెట్టుకోలేకపోతున్నారు!

అందుకు బాధ్యుడైన జగన్‌కి విజయసాయి రెడ్డి ధైర్యం చేసి ‘ఇది తప్పు’ అని చెప్పలేకపోతున్నారు. పైగా జగన్‌కు తందాన అంటూ చంద్రబాబు నాయుడుని రెచ్చగొట్టి కేసులు పెట్టించుకుంటున్నారు. దీనిని ఎటువంటి రాజకీయం అనాలి?