nara-lokesh-credibility

గత ఎన్నికల సమయంలో వైసీపి నేతలు రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని తదితర నేతలు ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలుసు. కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవని నారా లోకేష్‌ దొడ్డి దారిలో మంత్రి పదవి చేపట్టారని ఎద్దేవా చేసేవారు. ఇక వైసీపి సోషల్ మీడియాలో నారా లోకేష్‌ని ఎంతగా ట్రోలింగ్ చేసెడో అందరికీ తెలుసు.

Also Read – స్థలాలు, పొలాల కబ్జాలు కాదు… పోర్టునే కబ్జా చేస్తే?

కానీ యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ తనని తాను నిరూపించుకోవడమే కాకుండా 2024 ఎన్నికలలో మంగళగిరి నుంచే పోటీ చేసి గెలిచారు. కీలకమైన విద్యాశాఖ, ఐ‌టిశాఖలకు మంత్రిగా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కూడా.

ఆనాడు నారా లోకేష్‌ ఎందుకూ పనికిరాడని తేల్చిపడేసిన వైసీపి నేతలకు ఆయన ఇంత పట్టుదలగా, ఇంత త్వరగా రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతారని ఊహించలేకపోయారు. కనుక ఆయన ఎదుగుదలని జీర్ణించుకోవడం వారికి కష్టంగానే ఉంటుంది.

Also Read – కేసీఆర్‌, కేటీఆర్‌ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?

ఆ ఆక్రోశం, బాధనే విజయసాయి రెడ్డి తాజా ట్వీట్‌లో బయటపెట్టుకున్నారు. “సూపర్ సిక్స్ పేరుతో ఉత్తుత్తి హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారనేది నిజం. కానీ నారా లోకేష్‌ అన్నీ తానై నడిపిస్తున్నారనేది వాస్తవం. నిజానికి, వాస్తవానికి మద్య ఉన్న ఆ సన్నటి గీతని అర్దం చేసుకోవడం ప్రజాధర్మం,” అని ట్వీట్‌ చేశారు.

అంటే ఆనాడు తాము ఎందుకూ పనికిరాడని తీసిపడేసిన నారా లోకేష్‌ ఇప్పుడు ముఖ్యమంత్రిలా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని విజయసాయి రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారన్న మాట! నారా లోకేష్‌కి ఇంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఏముంటుంది?

Also Read – నారదుడుకి తక్కువేమీ కాదు.. మన వర్మ

యువగళం పాదయాత్రలోనే నారా లోకేష్‌ తాము అధికారంలోకి వస్తే ‘రెడ్ బుక్’లో పేర్లున్న ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని పదేపదే హెచ్చరించారు. కానీ మరో 30 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామనే భ్రమలో జగన్, వైసీపి నేతలు చెలరేగిపోయారు. చివరికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టించి టిడిపిని అడ్డుతొలగించుకోవాలని పెద్ద కుట్ర చేశారు. కానీ వారి కుట్రలే వారికి శాపాలుగా మారాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెడ్ బుక్ తెరుచుకుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో నారా లోకేష్‌ మాట్లాడుతూ “ఇప్పటికే రెడ్ బుక్ రెండో అధ్యాయం తెరిచాము. మూడో అధ్యాయం తెరిచేందుకు గుడివాడ టిడిపి నేతలు కాస్త గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది,” అన్నారు.

మరోపక్క సోషల్ మీడియాలో వైసీపి పేట్రేగిపోవడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కనుక వైసీపి నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.




చంద్రబాబు నాయుడు అయితే తమ పట్ల ఇంత కటినంగా వ్యవహరించరని వైసీపి నేతలకు గట్టి నమ్మకం ఉంది. కానీ నారా లోకేష్‌ వల్లనే తమకు ఇప్పుడు ఇన్ని కష్టాలు (కేసులు) మొదలయ్యాయని గట్టిగా నమ్ముతున్నారు. బహుశః అందుకే విజయసాయి రెడ్డి ఈవిదంగా తమ బాధని వ్యక్తం చేశారనుకోవచ్చు. తాము ‘పప్పు’ అని ముద్రేసిన నారా లోకేష్‌ ఇప్పుడు తమ తాట తీస్తుంటే భరించడం కష్టమేగా!