vinesh phogat

భారత్‌ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు… ఇంత దారుణమా!

పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ సుసాకిని ఓడించి ఫైనల్స్‌లోకి దూసుకు వచ్చిన భారత్‌ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై ఒలింపిక్స్‌ కమిటీ అనర్హత వేటు వేసింది.

Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?

ఈరోజు బుధవారం రాత్రి జరుగబోయే ఫైనల్స్‌లో ఆమె అమెరికా రెజ్లర్‌ సారా హిల్డేబ్రాంట్‌తో పోటీ పడేందుకు సిద్దమవుతుండగా, నిబంధనల ప్రకారం నిర్వాహకులు ఆమె బరువు పరీక్షించారు.

ఆమె 50 కేజీల కంటే 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు గుర్తించడంతో ఒలింపిక్స్‌ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read – జయభేరీకి హైడ్రా నోటీస్‌… నో వర్రీస్ మేము రెడీ

నిన్న జరిగిన ప్రీ-క్వార్టర్స్‌కు ముందు కూడా ఆమె బరువు పరీక్షించి 50 కేజీలున్నట్లు నిర్ధారించుకున్నాకనే పోటీకి అనుమతించారు. ఆ పోటీలో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్‌ రెజ్లర్ యూయి సుసాకితో సహా మరో రెజ్లర్‌ని కూడా ఓడించారు.

ఇంతవరకు ఓటమి ఎరుగని ప్రపంచ చాంపియన్‌ని ఓడించడమే గొప్ప అనుకుంటే ఫైనల్స్‌కు చేరడం ఇంకా గొప్ప విషయం. అందుకు ఆమెతో పాటు యావత్ భారత్‌ ఆనందంతో పొంగిపోతోంది. ఆమె తప్పక భారత్‌కు స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటే, వంద గ్రాముల బాదువు అధికంగా ఉందనే కారణంతో అనర్హత వేటు వేయడం చూసి ఆమెతో సహా అందరూ షాక్ అయ్యారు.

Also Read – టీడీపీలో ఆరోపణలు వచ్చాయి..ఆదేశాలు వెళ్లాయి..మరి వైసీపీలో.?

ఇంకా విషాదం ఏమిటంటే మంగళవారం ప్రీ-క్వార్టర్స్ లో నెగ్గిన తర్వాత రాత్రి బరువు చూసుకోగా సుమారు ఒక కేజీ వరకు అదనపు బరువు ఉన్నట్లు గుర్తించిన వినేష్ ఫోగట్‌ అది తగ్గించుకోవడం కోసం రాత్రంతా జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వగైరా చేస్తూనే ఉన్నారు. నిద్రాహారాలు మాని శ్రమించినా 100 గ్రాములు అదనపు బరువు కారణంగా ఒలింపిక్స్‌ నుంచి అనర్హత వేటు పడి నిష్కరించాల్సి రావడం చాలా బాధ, అవమానమే. ఆమె మంగళవారం రాత్రంతా నీళ్ళు కూడా తాగకుండా విపరీతంగా శ్రమించడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యి బుధవారం ఉదయం స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.

ఆ పరిస్థితిలో కూడా ఆమె తనకు మరొక గంట సమయం ఇస్తే 100 గ్రాముల బరువు తగ్గించుకుంటానని వేడుకోవడం అందరినీ కన్నీళ్ళు పెట్టిస్తుంది. భారత్‌ ఒలింపిక్స్‌ కమిటీ ఆమె తరపున ఒలింపిక్స్‌ కమిటీకి, రెజ్లింగ్ కమిటీని అభ్యర్ధించింది. కానీ ఆమె అభ్యర్ధనని తిరస్కరించిన్నట్లు తాజా సమాచారం.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధిద్దామని వినేష్ ఫోగట్‌ ఎంతో కృషి చేసి ఫైనల్స్‌ చేరుకున్నారు కానీ పోటీలో పాల్గొనలేక వెనక్కు తిరిగి రావలసి వస్తోంది. ఇది ఆమెకు ఎంత బాధ కలిగిస్తుందో ఊహించుకోవచ్చు.




ఆమె ఓడిపోతే సంతోషించేవారు భారత్‌లో చాలా మందే ఉన్నారు. వారు చేసే విమర్శలను, అవహేళనను భరించడం ఇంకా కష్టం! వివిద కారణాల చేత ఆమె ఒలింపిక్స్‌ పోటీలలో ఓడిపోవాలను కోరుకునే వారు భారత్‌లోనే అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వారు చేసే విమర్శలు, అవహేళనలు భరించడం వినేష్ ఫోగట్‌కు ఇంకా కష్టం.