Hari Hara Veera Mallu Vishwambhara Releases Postponed

టాలీవుడ్ స్థాయి, స్టామినా రెండు పెరుతున్న ఈ తరుణంలో మెగా ఫామిలీ సినిమాలకు ఏమయ్యింది అనే ప్రశ్న ఉత్మన్నమవుతుంది. మెగా స్టార్ చిరు నుంచి పవర్ స్టార్ పవన్, గ్లోబల్ స్టార్ చెర్రీ వరకు వీరి సినిమాల విషయంలో ఎందుకింత జాప్యం జరుగుతుంది, విడుదల తేదీల కోసం ఎందుకుని వాయిదాలు వెతుకుతుంది అన్న ప్రశ్న మెగా అభిమనాలను వెంటాడుతుంది.

ఉదాహరణకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్…ఇది ఒక్క బడ్జెట్ విషయంలోనే కాదు సమయం విషయంలో కూడా మెగా అభిమనుల సహనాన్నే కాదు సామాన్య ప్రేక్షకుడి ఓపికను కూడా పరీక్షించింది. తీరా ఆ సినిమా విడుదలతో అయినా అనుకున్న ఫలితం దక్కిందా అంటే ఆ చిత్రం చెర్రీ అభిమనులకు ఒక పీడ కలను గుర్తు చేస్తే, నిర్మాతలకు ఒక చేదు అనుభవాన్ని తీసుకొచ్చింది.

Also Read – అవినాష్, అనంతబాబుని పక్కన పెట్టుకొని జనసేనపై రాళ్ళు వేస్తే..

ఇక RRR సినిమాతో రామ్ చరణ్ కు వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను ఈ చిత్రం పూర్తిగా మసకమార్చింది. అసలు రామ్ చరణ్ ఎందుకు ఈ చిత్రాన్ని అంగీకరించారు అంటూ ఆయన అభిమనులే ఆలోచనలో పడే స్థాయిలో చిత్ర ఫలితం ఉంది.

ఇక ఇప్పుడు మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విషయంలో కూడా ఇప్పటికి వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. సాంకేతికాలు కారణాలో, బడ్జెట్ ఇష్యూ లో సమస్య ఏదైనా కానీ హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని కూడా విడుదల కోసం యుద్ధం చేస్తుంది.

Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు

పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా కొన్నేళ్లుగా షూటింగ్ లోనే మగ్గుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టింది. అయితే ఈ చిత్రం కోసం మొదట కొట్టిన కొబ్బరి కాయకు చివర కొట్టిన గుమ్మడికాయకు మధ్య ఒక డైరెక్టర్ మారారు, బడ్జెట్ మారింది, విడుదల తేదీలు ఇప్పటికి మారుతూనే ఉన్నాయి.

ఇక మెగా కుటుంబానికి పునాది వేసిన మెగాస్టార్ చిరు విషయానికొస్తే, ఈయన నటిస్తున్న విశ్వంభర చిత్రం 2023 అక్టోబర్ 23 న పూజ కార్యక్రమాలతో మొదలయ్యి 2025 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది అంటూ ప్రకటించగా, ఆ సంక్రాంతికి సినిమా కాదు ట్రైలర్ తో సరిపెట్టారు.

Also Read – గుడివాడ ఫ్లెక్సీ వివాదం..


అయితే ఆ ట్రైలర్ కూడా ఆదిపురుష్ సినిమా మాదిరి పూర్తి నెగటివ్ టాక్ తీసుకురావడంతో ఒక విశ్వంభర విడుదల ఎప్పుడన్నది వాయిదాల మాటున వెనక్కి నెట్టబడింది. చిరు కూడా విశ్వంభర ను సైడ్ చేసి అనిల్ రావి పూడి షూటింగ్ తో బిజీ అయిపోయారు. ఇలా జరుగుతున్న వరుస పరిణామాలతో మెగా ఫ్యామిలీ మూవీస్ విడుదల కి వాయిదాల గండం పట్టుకుందా అనిపిస్తుంది.