Where is The YSR Congress Coterie Reaction

వైసీపీ అధినేత జగన్‌ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీలో నేతల చెప్పుడు మాటల వలననే పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని, ఇకనైనా జగన్‌ ఆ కోటరీని చేధించుకొని బయటపడలేకపోతే వైసీపీకి భవిష్యత్‌ ఉండదని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కనుక వెంటనే వైసీపీ నేతలు మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ గుడివాడ అమర్నాధ్ ఒక్కరే “విజయసాయి రెడ్డి మనసు ఎందుకు విరిగిపోయిందో? ఎవరి కోసం విరిగిపోయిందో?ఆయన కూడా కోటరీలో ఉన్నారు కదా?” అంటూ ఏదేదో మాట్లాడారు.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

ఆ తర్వాత వైసీపీ మరెవరూ విజయసాయి రెడ్డిపై ప్రతివిమర్శలు చేయలేదు. కనీసం ఆయన చేసిన ఆరోపణలని ఖండించలేదు.

మరో విషయమేమిటంటే, కాకినాడ పోర్టు కేసు మొదలైనప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నారు. కనుక అదంతా ఓ కట్టుకధ, కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనంటూ వరుసపెట్టి ట్వీట్స్ వేశారు. అదే కేసులో మొన్న విజయవాడ సీఐడీ పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరైనప్పుడు, విజయసాయి రెడ్డి మరోలా మాట్లాడారు.

Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!

ఈ పోర్టు కబ్జా కేసులో కర్త, ఖర్మ,క్రియ అంతా విక్రాంత్ రెడ్డే అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అతనే తన అల్లుడు సోదరుడు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి తరపున కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుతో డీలింగ చేశారని చెప్పారు.

ఈ కేసులో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారి తాను బయటపడి జగన్‌కి ఎసరు పెట్టాలని చూస్తున్నారా?అనే సందేహం కలుగుతుంది.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

విజయసాయి రెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపుతూ ఇంత తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ, విక్రాంత్ రెడ్డి పేరు ప్రస్తావించినప్పటికీ వైసీపీ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఆలోచిస్తే దీనికి రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఆయనతో యుద్ధానికి దిగితే జగన్‌-గండికోట రహస్యాలు మరిన్ని బయటపెడతారనే భయం చేత కావచ్చు.




2. త్వరలో ఆయన బీజేపిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులలో జగన్‌ ఏ-1గా ఉంటే, ప్రతీ కేసులో విజయసాయి రెడ్డి ఏ-2గా ఉన్నారు. కనుక ఆయన బీజేపిలో చేరి ఆ కేసులు చక్కబెట్టుకునే ప్రయత్నం తప్పక చేస్తారు. చేసి ఆయన బయటపడితే జగన్‌ కూడా బయటపడతారు. కనుక ఆయనతో యుద్ధం చేయడం కంటే మౌనంగా విమర్శలు భరించడమే మంచిదని కావచ్చు.