Tollywood Percentage System

ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు.థియేటర్లు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నాయి ఇలాగైతే మూసుకోవాల్సిందే అనే మాటలు చాలా కాలంగా వింటున్నాం.

ఆ రకంగా చాలా థియేటర్లు ఇప్పటికే మూసుకుపోయాయి కూడా. థియేటర్లు మూసేసి కళ్యాణమండపాలు,వెర్ హౌస్లుగా మారిపోయాయి. ఈ ఏడాది పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండడంతో మళ్ళీ ఆ హైరానా మొదలయ్యింది.

Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!

మొన్న ఆ మధ్య ఈస్ట్ ఎక్సిబిటర్లు ఒక మీటింగ్ పెట్టుకుని ఇక రెంటల్స్ మీద నడపడం కష్టమని,పర్సెంటేజ్ సిస్టం లోనే సినిమాలు ఆడతామని ఒక తీర్మానం చేసారు. ఆ తరువాత కృష్ణ జిల్లా ఎక్సిబిటర్లు కూడా అటువంటి మీటింగే పెట్టారు. ఇప్పుడు ఇదే డిస్కషన్ నైజాంలో కూడా నడుస్తుంది.

ఈ మధ్య నైజాంలో శిరీష్, సునీల్ నారంగ్, సురేష్ బాబు చేతులు కలిపారు ఇక నుండి ఒక సిండికేట్ గా కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?

పర్సెంటేజ్ సిస్టం కోసమని ఈ నెల 18న నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. పర్సెంటేజ్ సిస్టం వస్తేనే థియేటర్ల ఓనర్లకు డబ్బులు కనబడతాయి అనేది నిజమే. అయితే నిర్మాతలకు మాత్రం వచ్చే నాలుగు డబ్బులు కూడా పోతాయి.

ఇప్పటికే థియేటర్ల నుండి వచ్చే రివెన్యూ తక్కువ… పర్సెంటేజ్ సిస్టం అంటే ఆ చిల్లర కూడా రాదు.

Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!

నైజాంలో థియేటర్లు చాలా వరకు ఈ ముగ్గురి కిందే ఉండడంతో అంతిమ లబ్ధిదారులు వీళ్ళే…నష్టపోయేది నిర్మాతలు. ఇప్పటికే ఓటీటీల రెవిన్యూ బాగా తగ్గిపోయింది. థియేటర్ల నుండి వస్తుంది అంతంత మాత్రమే. ఇంకా తగ్గితే హీరోలకు ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఎలా సినిమాలు తీస్తారు?

నైజాంలో 640 చిల్లర థియేటర్లు ఉన్నాయి. దాదాపుగా 240 థియేటర్లు ఈ ముగ్గురి కిందే ఉన్నాయి.ఇంకో 200 థియేటర్లు మల్టీప్లెక్స్లు ఉన్నాయి (మల్టీప్లెక్స్ లోని ప్రతి స్క్రీన్ ఒక థియేటర్ అన్నట్టు). మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే పర్సెంటేజ్ సిస్టం లోనే నడుస్తున్నాయి.

ఇక మిగిలినవి 200 అందులో 100 సీ క్లాస్ థియేటర్లు…అందులో సినిమాలు వెయ్యడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. మిగిలిన 100లో 40-45 మైత్రీ దగ్గర ఉన్నాయి. అంటే ఈ ముగ్గురికి ఇబ్బంది ఉండేది 60-65 థియేటర్లలోనే. కాబట్టి పర్సెంటేజ్ సిస్టం బట్టి లాభపడేది ఈ ముగ్గురే.

అయితే ఈ ఐడియా ఇప్పటిది కాదు. కరోనా తరువాత ఏఎంబీ లో శిరీష్, సునీల్ నారంగ్ ఒక మీటింగ్ పెట్టుకుని పర్సెంటేజ్ సిస్టం లోనే సినిమాలు అని ఒక రూల్ తెచ్చారు. అయితే అది ఇంప్లీమెంట్ కాలేదు.

ఎందుకు ఇంప్లీమెంట్ కాలేదు అంటే అప్పట్లో దిల్ రాజు కు వరుసగా పెద్ద సినిమాలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్, వకీల్ సాబ్, కేజీఎఫ్2, సర్కారు వారి పాట… సినిమాలు వరుసగా రావడంతో నష్టపోకుండా పర్సెంటేజ్ సిస్టం ను పక్కన పెట్టేశారు.

ఇప్పుడు దిల్ రాజు – సునీల్ నారంగ్ – సురేష్ బాబులకు పెద్ద సినిమాలు ఏమీ లేవు.పెద్ద సినిమాలన్నీ మైత్రి దగ్గరే ఉన్నాయి.ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టం అంటే నష్టం వాళ్ళకే.

వాళ్ళతో పాటు ఎక్కువగా సినిమాలు చేసే సితారా నాగవంశీ కూడా నష్టపోవడం ఖాయమే. నాగవంశీకి థియేటర్లు లేకపోవడంతో పర్సెంటేజ్ సిస్టం వల్ల వచ్చే బెనిఫిట్ ఆ ముగ్గురుకు వెళ్తుంది. నాగవంశీ మాత్రం సగటు నిర్మాతల నష్టపోవడం ఖాయం.

థియేటర్లు బాగుపడతాయి అంటే మంచి విషయమే కాకపోతే ఇప్పుడు ఇబ్బంది అంతా మోనోపోలీ ఉన్న చోట థియేటర్ ఓనర్లు కంటే సిండికేట్లు బాగు పడతారు.

థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాలి గానీ పర్సెంటేజ్ సిస్టం టెంపరరీ ఫిక్స్ మాత్రమే. ఎకో సిస్టం అంతా మారితేనే థియేటర్లు బాగుపడతాయి.




నిర్మాతలు 8 వారలు లోపు ఓటీటీకి ఇవ్వకూడదు. హీరోలు రెమ్యూనరేషన్లు తగ్గించుకుని వాటాలు తీసుకోవాలి. అలాగే ఏడాదికి రెండు సినిమాలు చెయ్యాలి. డిజిటల్ కంపెనీలు క్యూబ్ ఛార్జీలు తగ్గించుకోవాలి. ఇలా అందరూ కలిసి వస్తేనే థియేటర్లు బాగుపడతాయి.