CBN Jagan

గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం తన చేతిలో అధికారాన్ని పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతూ తన చేతకాని తనాన్ని బాబు మీద కు నెట్టేసి దీనికంతటికి బాబే కారణమంటు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసారు.

అయితే వైసీపీ చెప్పిన బాబు పాఠాన్ని విన్నట్టు, నమ్మినట్టు నటించి చివరికి ఓటు వేసే సమయం వచ్చే సరికి ప్రజలు కూటమి పార్టీ నేతల బటన్లు నొక్కి జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్నాళ్లు వైసీపీ ప్రభుత్వం పై ఎవ్వరు విమర్శలు చేసినా దానికి పసుపు రంగు అంటించి వారిని బాబు మనుషులుగా ముద్ర వేసేవారు.

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

దీనికి తన సొంత కుటుంబ సభ్యులును కూడా అర్హులుగా ప్రకటించిన జగన్ తన సొంత చెల్లి షర్మిలను, బాబాయ్ వివేకా కుమార్తె సునీత ను కూడా బాబు మనుషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు . అయితే జగన్ విమర్శలతో విసిగి పోయిన షర్మిల జగన్ కు బాబు పిచ్చి పట్టింది అంటూ జగన్ ను క మానసిక రోగిగా చిత్రీకరించారు.

అమరావతి రైతులు బాబు మనుషులే, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు బాబు మనుషులే, ఆ కేసులు వాదించే న్యాయవాదులు బాబు కోసం పనిచేసే వారే, ముఖ్యమంత్రిగా జగన్ కు భజన చేయడానికి ఆసక్తి చూపని మీడియా ఎల్లో మీడియానే ఇలా ప్రతి అంశంలోనూ బాబు గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు జగన్.

Also Read – ప్రతీసారి ఒక దెబ్బకు రెండు పిట్టలంటే ఎలా?

అలాగే వైసీపీ వ్యతిరేఖ ఓటు చిలనివ్వను అంటూ ప్రతిజ్ఞ చేసిన పవన్, బాబు పల్లికి మోయడానికే అంటూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి మొదలుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరకు అందరూ బాబు కోసమే పని చేస్తున్నారని, అంతెందుకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాబు గెలుపు కోసం సాయపడతారంటూ జగన్ తన ఎన్నికల ప్రచారంలో పదేపదే ఆరోపించారు.

అయితే జగన్ తన వ్యాఖ్యలతో బాబును రాజకీయంగా దెబ్బ కొడుతున్నాను అనే భ్రమ నుండి బయటకు రాలేకపోయారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత జగన్ అన్నట్టుగానే రాష్ట్రంలో సగం మందికి పైగా “బాబు మనుషులే” అని నిరూపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో దోపిడీకి గురైన ప్రతి ఒక్కరు, దాడులను ఎదుర్కున్న ప్రతి కుటుంబం కూటమి గెలుపు కోసం, బాబుని సీఎం చెయ్యడానికి చేతులు కలిపి 164 సీట్లతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని కట్టబెట్టారు.

Also Read – అప్పుడు వద్దనుకున్న రాజ్యాంగమే అవసరం పడిందిప్పుడు

అసలు కలుస్తారా.? కలవరా.? అనుకున్న రెండు పార్టీలు జగన్, బాబుని జైల్లో పెట్టడంతో ఏకమయ్యాయి. గ్రౌండ్ లెవెల్ వరకు జనసేన, టీడీపీ పార్టీల కార్యకర్తలు కలవడంతో ఇక బీజేపీ కూడా ఈ రెండు పార్టీల పొత్తులో భాగమయ్యింది. అసలు బాబు అరెస్టే లేకపోతే ఇదంతా జరిగి ఉండేదా అంటే.? దీనితో వైసీపీ కి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఈ దుస్థితికి బాబు కారణమా.? జగన్ కారణమా.? అనేది వైసీపీ నేతలే గ్రహించాలి.