ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ప్రతిపక్షానికి మారిన వైసీపి అప్పుడే చెలరేగిపోతుంటే రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా మారిన బీజేపీ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ఏ పార్టీ అయినా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ఆ పార్టీ హడావుడి అంతా ఇంతా ఉండదు. కానీ ఏపీ బీజేపీ నేతలు ఇంకా ఉదాసీనంగానే ఉండటం ఆశ్చర్యకరమే.
Also Read – వంశీ, కొడాలినే టచ్ చేయలేకపోతే ఇక…
ఎన్నికలలో పలువురు సీనియర్లకు టికెట్స్ నిరాకరించడం, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సూచించినవారికే టికెట్స్ దక్కడమే వారి మౌనానికి కారణంగా కనిపిస్తోంది. కానీ ఏపీ బీజేపీ నేతల మౌనం అపోహలకు తావిస్తోంది.
బీజేపీ అధిష్టానం టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పటికీ, జగన్ పట్ల మమకారం తగ్గలేదని, జగన్ కూడా కేంద్రానికి అవసరమైనప్పుడు పార్లమెంట్ ఉభయ సభలలో తన ఎంపీల మద్దతు అందించడానికి సిద్దంగా ఉన్నారు. అందువల్లే బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ నేతలను జగన్, వైసీపికి వ్యతిరేకంగా మాట్లాడకుండా కట్టడి చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read – ఈ మర్యాద, గౌరవం నాకొద్దు బాబోయ్!
వాటికి చెక్ పెడుతున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తొలిసారిగా జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ప్రధానికి లేఖ వ్రాయడం చాలా విడ్డూరంగా ఉంది. గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో తన అరాచక పాలన ఏవిదంగా సాగిందో అందరికీ తెలుసు. ఆ కారణంగానే ప్రజలు జగన్‌ని గద్దె దించేశారు.
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ కొరత ఉందని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్‌ని మీ ప్రభుత్వం వేదించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో మా పార్టీ అభ్యర్ధులు నామినేషన్స్ వేయడానికి వెళితే వైసీపి గూండాలు వారి చేతిలో పత్రాలు లాక్కొని చించేసి బెదిరించి వెనక్కు పంపేశారు.
Also Read – ఆ పాఠాలు మనోడికి కూడా వర్తిస్తాయిగా?
ఇతరులను విమర్శించే ముందు వైసీపి అరాచకాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. పేర్ని నాని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇద్దరూ నోటికి వచ్చిన్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడులు రాజకీయాలతో సంబందం లేదు కానీ అవి చాలా హేయమైనవి. కనుక రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం అణచివేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.