
జగన్‌కి పరిపాలన చాతకాకపోయినా, రాజకీయాలు చేయడంలో ఆరితేరారు. అయితే ఆ రాజకీయాలు ప్రజాస్వామ్య చట్రంలో ఇమడవు.
వ్యూహాల పేరుతో కుట్రలు, కుతంత్రాలు, భౌతిక దాడులు, ప్రాంతాలు, కులమతాల మద్య చిచ్చు రగిలించడం ఒకటేమిటి.. జగన్ చేయని రాజకీయం లేదు.
Also Read – చీకట్లో వేసేసి పగలు పరామర్శించాలట!
తాజాగా పొదిలి, రెంటపాళ్ళ పర్యటనలో ‘కొడకల్లారా తలలు నరికేస్తాం’ అని ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని, పోలీసులను, అధికారం పార్టీ నేతలని, ప్రజలని భయపెట్టేందుకు ప్రయత్నించడం పరాకాష్ఠ.. అని అప్పుడే నిర్ధారించలేము. ఎందువల్ల అంటే రాబోయే రోజుల్లో జగన్ ఇంకా ఎంత భయానక రాజకీయాలు చేస్తారో ఎవరికీ తెలియదు కనుక!
జగన్ రెంటపాళ్ళకి వెళ్ళింది తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి. కానీ ఆ పర్యటన వెనుక వేరే ఉద్దేశ్యం ఉందని వైసీపీ శ్రేణులు చేసిన హడావుడి, ఆయన మాటలతోనే స్పష్టమైంది.
Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం
అక్కడ వల్లభనేని వంశీ ప్రస్తావన చేసి కమ్మ సామాజికవర్గం పట్ల జగన్ మొసలి కన్నీళ్ళు కార్చడం కూడా ఓ రాజకీయ ఎత్తుగడే.
వైసీపీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వంశీ, కొడాలి నాని వంటివారు ఎటువంటి తప్పుడు పనులు చేశారో అందరికీ తెలుసు. అందుకు వారిపై కేసులు నమోదు చేస్తే, దానిని యావత్ కమ్మ సామాజిక వర్గానికి ఆపాదించి, ఇతర పార్టీలలో కమ్మ నాయకులు ఉండకూడదా?ఉంటే వేధిస్తారా?అంటూ జగన్ ప్రశ్నించడం అతితెలివి ప్రదర్శించడంగానే భావించవచ్చు.
Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు
తద్వారా కమ్మ సామాజిక వర్గంలో చీలిక సృష్టించి సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ పట్ల వ్యతిరేకత పెంచాలని జగన్ దురాలోచనగా కనిపిస్తోంది.
ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభ రెడ్డిని హడావుడిగా పార్టీలో చేర్చుకొని కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చి పవన్ కళ్యాణ్‌ని, జనసేనని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించారు. అందుకు ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా నేటికీ జగన్ తీరు మారలేదని కమ్మ సామాజిక వర్గంలో చీలిక తేవాలని చేసిన ఈ ప్రయత్నంతో మరోసారి నిర్ధారణ అయ్యింది.
ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను మెప్పించి మళ్ళీ అధికారంలోకి రాగలనని జగన్ అనుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది.
జగన్ 175/175 మనకే అని చెప్పి మభ్యపెట్టినందుకే రెంటపాళ్ళలో వైసీపీ కార్యకర్త మల్లేశ్వర రావు ఉన్నదంతా ఊడ్చిపెట్టి, అప్పులు తెచ్చి మరీ పందాలు కాసి, ఆ అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిదంగా జగన్ అందరినీ ముంచేసినప్పుడైన మేల్కోవలసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నేటికీ ఆయన మాటలు నమ్మి, చెప్పింది చేస్తూ జైలు పాలవుతున్నారు.
జగన్‌ని నమ్ముకుంటే చివరికి జర్నలిస్ట్ అయినా జైలుకి వెళ్ళక తప్పదని కొమ్మినేని అరెస్టుతో స్పష్టమైంది. అయినా జగన్ వెనుక పరుగులు తీస్తుండటం చూస్తే జాలేస్తుంది.