Why Narendra Modi Started War Against Pakistan

భారత్‌ అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకికవాద దేశం కాగా, పాకిస్థాన్‌ ఇస్లాం మతం అనుసరించే దేశంగా నిలిచింది.

ఇందువల్లే భారత్‌లో వివిద మతస్తులు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అన్ని రంగాలలో సమాన స్థాయిలో కనిపిస్తుంటారు.

Also Read – కేటీఆర్ కు హరీష్ మద్దతు దక్కినట్టేనా.?

కానీ పాక్‌ ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయింది. పైగా భారత్‌పై ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేస్తూనే ఉంది.

అందువల్లే భారత్‌లో అసదుద్దీన్ ఓవైసీ వంటి ముస్లింలు సైతం పాక్‌ తీరుని తప్పు పడుతూ, దానికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందే అని కోరుతున్నారు.

Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?

పాక్‌ దుస్థితికి దాని పాలకులు, సైన్యాధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉండగా, అవినీతి, అసమర్ధతకు మారుపేరుగా నిలుస్తున్న వారు, భారత్‌ని బూచిగా చూపిస్తూ నిందిస్తున్నారు! ఇప్పుడు భారత్‌తో యుద్ధానికి దిగిన తర్వాత కూడా వారి ధోరణిలో ఎటువంటి మార్పు లేదు.

జర్మనీలో నియంత హిట్లర్ నాజీ విధానాన్ని అమలుచేసినట్లుగా, భారత్‌లో కూడా హిందుత్వ విధానాన్ని అమలు చేయాలని నాడు అంటే.. 1938లోనే వీర సావర్కర్ సూచించారని, అప్పటి నుంచే భారత్‌లో ఆర్‌ఎస్ఎస్ ఆ విధానాన్ని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోందని ప్రముఖ పాక్‌ ఆంగ్ల పత్రిక ‘డాన్’ పేర్కొంది.

Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్‌ గారు?

అందుకే ప్రధాని మోడీ అవకాశం చిక్కినప్పుడల్లా పాకిస్థాన్‌ దాడులు చేయిస్తూ ఆ విధానాన్ని అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని డాన్ పత్రిక పేర్కొంది.

జమ్ము కశ్మీర్‌లో వేలాది మందికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పహల్గాం దాడి జరిగితే, ప్రధాని మోడీ ఆ సాకుతో మళ్ళీ తన హిందుత్వ అజెండాని అమలుచేసేందుకే పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభించారని డాన్ పత్రిక పేర్కొంది.

డాన్ పాక్‌ పత్రిక కనుక ప్రధాని మోడీ, భారత్‌ తీరుని ఆక్షేపించడం సహజమే. కానీ తమ పాలకుల ఆలోచన ధోరణి, అవినీతి, అసమర్ధత, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతున్న తమ ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వంపై సైన్యం పెత్తనాన్ని సమర్ధించగలదా?అంటే కాదనే చెప్పవచ్చు.

కనుక తమ విధానాలలోనే ఇన్ని లోపాలు, ఇన్ని వైఫ్యల్యాలు పెట్టుకొని వాటికి భారత్‌, ప్రధాని మోడీయే కారణమంటూ నిందించడం దేనికి?

ఒకవేళ ప్రధాని మోడీ విధానాలు సరైనవి కావని దేశ ప్రజలు భావిస్తున్నట్లయితే నేడు పాక్‌తో యుద్ధం విషయంలో ఆయనకు మద్దతు పలికేవారు కారు కదా?




ప్రధాని మోడీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా దేశంలో అన్నీ పార్టీలు మద్దతు పలుకుతున్నాయిప్పుడు. మరి పాక్‌ ప్రధానికి, ఆయన ప్రభుత్వానికి ఈవిదంగా మద్దతు లభిస్తోందా? డాన్ పత్రికే చెప్పాలి.