ys-vivekananda-reddy-murder-case

ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఇద్దరూ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా అక్కడా వారికి నిరాశే ఎదురైంది. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తు అధికారులని కట్టడి చేసినట్లవుతుందని చెపుతూ బెయిల్‌ తిరస్కరించింది. కనుక తర్వాత ఏం జరుగుతుందనేది ఊహించవచ్చు.

మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు దానిపై ప్రభావం పడుతుందని చెపుతూ నిందితులకు బెయిల్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్‌ ఎందుకు మంజూరు చేసిందనే సందేహం కలుగుతుంది.

Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్‌ పట్టించుకోవట్లేదే!

సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే ఆ కేసు విచారణని అవినాష్ రెడ్డి లేదా ఇతర నిందితులు చాలా ప్రభావితం చేశారు కదా? ఆ కేసుపై విచారణ జరిపేందుకు వచ్చిన సీబీఐ అధికారిపై ఎదురు కేసులు పెట్టించడం, సీబీఐ అధికారులు హైదరాబాద్‌ నుంచి వస్తుంటే వారిని ఆయన అనుచరులు కర్నూలులో అడ్డుకోవడం వంటివన్నీ కేసుని ప్రభావితం చేస్తున్నట్లే కదా?

అసలు ఈ కేసు విచారణని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు ఎందుకు బదిలీ చేయవలసి వచ్చింది?ఈ కేసు విచారణ ముగించడానికి సుప్రీంకోర్టు స్వయంగా సీబీఐకి గడువు విధించినా నేటికీ విచారణ ఎందుకు పూర్తికాలేదు?ఇంకా ఎందుకు కొనసాగుతోంది? అని ఆలోచిస్తే నిందితులు ఈ కేసుని ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్దమవుతుంది.

Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?

మద్యం కుంభకోణం కేసు విచారణ ప్రభావితం కాకూడదని నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్‌ తిరస్కరించినప్పుడు, ఇదే నియమం వివేకానంద రెడ్డి హత్య కేసుకి కూడా వర్తింపజేయాలి కదా? కానీ ఆ కేసుని ఓ విదంగా, ఈ కేసుని మరో విదంగా ఎందుకు?అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.




Also Read – సొంత చెల్లినే పీడించిన జగన్‌ ప్రత్యర్ధులను ఉపేక్షిస్తారా?