
2023 తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ఒక్కసారిగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టీవ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు కేసీఆర్.
అటు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడంలో కానీ ఇటు సొంత పార్టీలో వస్తున్న అంతర్గత పోరు పై కానీ కేసీఆర్ నుంచి ఏవిధమైన స్పందన రావడం లేదు. ఓటమి భారంతో పార్టీలోని సీనియర్లంతా గులాబీ కారు దిగి హస్తం గూటికి చేరుకున్నా,
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
లిక్కర్ స్కాం కేసులో సొంత కుమార్తె కవిత అరెస్టయ్యి దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉన్నా, కొడుకు కేటీఆర్ పై ఫోన్ టాపింగ్, ఈ కార్ రేసింగ్ కేసుల ఆరోపణలు వినిపిస్తున్నా, చివరికి కాళేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్, హరీష్ రావు లకు విచారణ నోటీసులు ఎదురైనా కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ నుంచి ఒక్క రాజకీయ ప్రకటన కుడా రాలేదు.
తాజాగా ఇక బిఆర్ఎస్ లో బాంబు లా పేలిన కవిత లేఖాస్త్రం మీద కూడా పారీ అధినేతగా కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించనే లేదు. కేసీఆర్ దేవుడు…కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఇంటా బయటా ఆ దెయ్యలేవారు అనేదాని మీదే చర్చ జరుగుతుంది.
Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?
అయినా కూడా కేసీఆర్ తన మౌన ముద్రను వీడి పార్టీ శ్రేణులకు ధైర్యం కలిగేలా భరోసా ఇచ్చేలా ఒక్క మాట కుడా మాట్లాడలేదు. దీనితో అసలు కేసీఆర్ కు ఏమయ్యింది.? కేసీఆర్ మౌనం వెనుక ఎవరున్నారు.? కవిత ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్ ను కొన్ని శక్తులు కంట్రోల్ చేస్తున్నాయా.?
ఒక్క ఓటమి ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాయ్కటిని మూగవాడిగా చేసేసిందా.? అనే ఎన్నో ప్రశ్నలు అటు కేసీఆర్ ప్రత్యర్థులనే కాదు ఆయన అభిమానులను కూడా వేధిస్తున్నాయి. కేసీఆర్ ప్రతి విషయంలోనూ ఇలాగే మౌనాన్నే ఆశ్రయిస్తే గులాబీ కారు తెలంగాణ రాజకీయ ఊబిలో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!
నాడు కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పుతా అంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు కొడుకు, కూతురు ఆధిపత్య రాజకీయాల మధ్య చక్రంలా తిరుగుతున్నారు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం కేసీఆర్ మౌనాన్ని ఎద్దేవా చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కేసీఆర్ తన మౌనానికి ముగింపు పలికి గులాబీ కారును సరైన దిశలో పయనించేలా చేస్తారా.?