
ఈ 18 వ సీజన్ ఐపీఎల్ లీగ్ స్టేజి ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన చూసిన అభిమానులు, మరియు క్రికెట్ అనలిస్టులు ఈసారి కూడా ముంబై జట్టు ఇంటి దారి పట్టనుందని నిర్దారించేసారు.
గతేడాది కూడా స్టార్ ఆటగాళ్లను కలిగిన ఆ జట్టు ఘోరంగా విఫలమయి, ఇంటి దారి పట్టారు, ఈసారి కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అంటూ చెలరేగిపోయారు ఏంటి-ఫ్యాన్స్.
Also Read – తొలి అడుగు చాలా అవసరమే!
అయితే, తొలి 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లను చేజార్చుకుని, ఒకప్పటి ముంబై ఇండియన్స్ మళ్ళీ కనిపించదేమో అని ఫాన్స్ అనుకునేలోపే, చెట్ల చాటున దాక్కున్న పులి ఒక్కసారే పంజా వేసినట్టు, ఒకటి కాదు రెండు కాదు, వరుసగా 6 మ్యాచ్లలో ఆపొజిషన్ ను భీకరంగా డామినేట్ చేసి విజయ పరంపర మోగించారు.
ఏది ఏమైనప్పటికి, మొదటిలో వరుస ఓటములు ఆ జట్టు ప్లే-ఆఫ్ ఆశలకు ఎసరు పెట్టనే పెట్టింది. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో గుజరాత్ పై ఓడిన ముంబై జట్టుకు, నేడు ముంబై వేదికగా ఢిల్లీ కాపిటల్స్ జట్టు తో ఒక మినీ నాక్-అవుట్ మ్యాచ్ ఏ ఉండనుంది. ఇవాళ ముంబై విజయాన్ని సాధిస్తే, దాదాపు ఆ జట్టు ప్లే-ఆఫ్స్ ను చేరినట్టే.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
ఇప్పటికే గుజరాత్, బెంగళూరు మరియు పంజాబ్ జట్లు ప్లే-ఆఫ్స్ కు దూసుకెళ్ళగా, ఆ మిగిలిన ఒక్క చోటు కోసం ఢిల్లీ మరియు ముంబై జట్లు తలపడనున్నారు. ఆ పోరు లో భాగంగానే నేడు ఈ రెండు జట్లకు ఒక హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ముంబై గెలిస్తే, తమ ప్లే-ఆఫ్ స్పాట్ ను ఒడిసి పట్టుకోనున్నారు. ఓడిన వేళ, ఆ నాల్గవ ప్లే-ఆఫ్ జట్టు ఏదని తెలిసేందుకు మరికొన్ని రోజులు ఆగక తప్పదు! అయితే ఇదంతా కూడా వరకు దేవుని కురుపు పై ఆధారపడి ఉంది అనే వాస్తవాన్ని ఇరు జట్ల అభిమానులు గమనించాలి.