YS Jagan Tweet On Mother Day

నేడు మాతృదినోత్సవం సందర్భంగా తల్లుల ప్రేమానురాగాలు, అనుబంధాలు, త్యాగాలు, గొప్పదనాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మంత్రి నారా లోకేష్‌ కూడా తల్లి భువనేశ్వరి ఫోటోతో సోషల్ మీడియాలో, “నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ. నడిపించిందీ, నడత నేర్పినదీ అమ్మే. ఓడినా, గెలిచినా వెంట నిలిచింది అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?

ప్రతీ బిడ్డకు నిత్యాస్పూర్తి మాతృమూర్తి. సహనం, త్యాగం, ప్రేమ మూర్తీభవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేస్తున్నాను,” అని ట్వీట్ చేసి యువగళం తన చేతిలో చేయి వేసి కలసి పాదయాత్ర చేసిన తల్లితో దిగిన ఫోటోని పెట్టారు. ఆ ఫోటో ఒక్కటి చాలు ఆ తల్లీ కొడుకుల అనుబంధం ఎంత మధురంగా ఉందో అర్దం చేసుకునేందుకు.

నారా లోకేష్‌ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో సామాన్యులు మొదలు వివిద రంగాల ప్రముఖుల వరకు అందరూ ఈరోజు తమ తల్లులను పలకరించి శుభాకాంక్షలు చెపుతున్నారు.

Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ‘హ్యాపీ మదర్స్ డే అమ్మ’ అంటూ తల్లికి శుభాకాంక్షలు తెలిపారు… మొక్కుబడిగా. కారణం అందరికీ తెలుసు. ఆస్తుల కోసం తల్లి విజయమ్మని, చెల్లి షర్మిలని కోర్టుకు ఈడ్చారు జగన్‌. నేటికీ కోర్టులో తల్లి, చెల్లితో ఆస్తుల గురించి కొట్లాడుతూనే ఉన్నారు. వారు కూడా జగన్‌ తమని మోసం చేశారని ఆరోపిస్తూనే ఉన్నారు.




కనుక మాతృదినోత్సవం, రాఖీ పండుగ వంటివి కూడా జగన్‌కు చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి. సొంత తల్లి, చెల్లితో ఈవిదంగా వ్యవహరిస్తున్న జగన్‌, రాష్ట్రంలో మహిళలందరూ తన అవ్వ, తల్లి, చెల్లి, అక్కా, వదినమ్మలే అన్నట్లు ప్రేమ ఒలకబోస్తుంటే నమ్మశక్యంగా ఉంటుందా?

Also Read – వైసీపీ..ఒక “అందమైన” కుటుంబం..