తాను అధికారంలోకి వస్తే ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పిన జగన్, తర్వాత మాట మార్చి దశలవారీగా అమలుచేస్తామని చెప్పారు. తర్వాత మద్యం ధరలు విపరీతంగా పెంచేసి మందుబాబులను దోచుకున్నారు. ఆ తర్వాత కల్తీ మద్యం, నకిలీ బ్రాండ్లతో వారి ఆరోగ్యాలు దెబ్బ తీశారు.
మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకొని అసమదీయులకు వాటిని పంచేశారు. భవిష్యత్‌లో మద్యం అమ్మకాలను చూపించి అప్పులు కూడా చేశారు. అసలు మద్యం దుకాణాలలో వైసీపి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు. మద్య దుకాణాల వద్ద ఉపాధ్యాయలకు డ్యూటీలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు మద్యం వ్యాపారంలో ఇన్ని జిమ్మీక్కులు చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేవారు.
Also Read – నాడు పప్పూ అన్నారుగా… ఇప్పుడు భయపడితే ఎలా?
మద్యం వ్యాపారంలో వైసీపిది అందె వేసిన చెయ్యి గనుక, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలుకు దరఖాస్తుల విషయంలో వేలెత్తి చూపగలుగుతోంది.
“రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం @JaiTDP మద్యం సిండికేట్‌వే“ అని వైసీపి ట్వీట్ చేసింది.
Also Read – వర్రాని వైసీపియే లేపేస్తుందేమో? బీటెక్ రవి
3,396 దుకాణాల నిర్వహణకి దరఖాస్తులు ఆహ్వానిస్తే 87,116 వచ్చాయని వైసీపియే చెపుతోంది. అంటే ఈ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని స్పష్టమవుతోంది. ఒకవేళ అధికార పార్టీ నేతలు సిండికేట్ అయితే ఇన్ని దరఖాస్తులు వచ్చి ఉండేవే కావు కదా?
మద్యం వ్యాపారాలలో ఆరితేరిన వైసీపి నేతలు కూడా దరఖాస్తులు వేయించే ఉంటారు. విపరీతమైన ఈ పోటీ వలన నష్టపోతామనే ఆందోళన చెందుతున్నారేమో? అదే జగన్ ప్రభుత్వంలో అయితే ఈ హడావుడి ఏదీ లేకుండా మద్యం దుకాణాలు పంపకాలు జరిగిపోయేవి కదా? అని బాధపడుతున్నారేమో?