
బెట్టింగ్ యాప్‌ల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల మంగళవారం ఉదయం పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది గనుక దీని గురించి ఎక్కువ మాట్లాడలేను. కానీ ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను.
Also Read – ప్రమోషన్స్ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!
ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా జీవితాలు నాశనమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పోయినవారిని ఎలాగూ తిరిగి తీసుకురాలేను. కనుక వారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను.
ఇకపై ఇటువంటివి జరుగకుండా ఉండేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు సంబందించి నాకు తెలిసిన సమాచారం అంతా పోలీసులకు అందజేసి వారిని పట్టుకోవడానికి అన్ని విధాలా పోలీసులకు సహకరిస్తాను.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతీ ఒక్కరిపై ఉంది,” అని అన్నారు.
ఇంతకాలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, అందుకోసం సదరు కంపెనీల నుంచి భారీగా సొమ్ము తీసుకున్నారు. వీటితో సులువుగా డబ్బు సంపాదించవచ్చని సినీ ప్రముఖులు పదేపదే చెపుతుండటంతో వారిపై అభిమానమో, నమ్మకంతోనో పలువురు తమ కష్టార్జితాన్ని పెట్టి జూదం ఆడి నష్టపోయారు. జీవితాలు నాశనం చేసుకున్నారు. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?
బెట్టింగ్ కంపెనీలు ప్రజల చేత జూదం ఆడించి డబ్బు సంపాదించుకోగా, అవిచ్చే డబ్బుకి ఆశపడి సినీ ప్రముఖులు వాటికి ప్రచారం చేశారు. కనుక ఆయా బెట్టింగ్ కంపెనీలకు ఎంత బాధ్యత ఉందో వాటిని ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు అంత బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు సమాజంలో అందరూ బాధ్యత తీసుకోవాలని శ్యామల చెపుతుండటాన్ని ఏమనుకోవాలి?
అయినా మాదక ద్రవ్యాల కేసులలోనే సినీ ప్రముఖులపై పోలీసులు చర్యలు తీసుకోలేనప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులలో చర్యలు తీసుకుంటారా?